Raju Weds Rambai: విరాట పర్వం దర్శకుడు వేణు ఉడుగుల నిర్మాణ భాగస్వామ్యంతో తెరకెక్కిన తాజా చిత్రం రాజు వెడ్స్ రాంబాయి.ఈటీవీ విన్ ఒరిజినల్స్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వి రావు (ప్రధాన పాత్రలు), శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి కీ రోల్ లో నటించారు.
ఖమ్మం – వరంగల్ జిల్లాల సరిహద్దులోని ఒక గ్రామంలో 2004లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. హీరో రాజు, తన ప్రేయసి రాంబాయిని పెళ్లి చేసుకున్నట్లు ఊహించుకుంటూ తరచుగా రాజు వెడ్స్ రాంబాయి అని రాస్తుంటాడు. ఈ ప్రేమికులకు ఏం జరిగింది, ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నారు, వారి ప్రేమ ఎందుకు విషాదాంతమైంది అనే అంశాలను చిత్రంలో భావోద్వేగంగా చూపించారు.
నవంబర్ 21న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుకుంటారని 7/జీ బృందావన్ కాలనీ, RX 100, బేబీ వంటి కల్ట్ లవ్ స్టోరీల సరసన ఈ సినిమా కూడా నిలుస్తుందని నిర్మాత వేణు ఉడుగుల ధీమా వ్యక్తం చేశారు.
ఇక దర్శకుడు సాయిలు కంపాటి మాట్లాడుతూ ఈ సినిమాకు బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ సినిమాకు సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తాను అర్ధనగ్నంగా అమీర్‌పేట్ సెంటర్‌లో తిరుగుతానంటూ కామెంట్స్ చేశారు. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.దయచేసి నెగెటివ్ ప్రచారం చేయవద్దని కోరారు.
15 ఏళ్లు ఓ జంటకు నరకం చూపించిన కథను మీ ముందుకు తీసుకువస్తున్నానని తెలిపారు. మీకు నచ్చకపోతే వదిలేయండి.. అంతేకానీ నెగెటివ్‌గా మాట్లాడకండని కోరారు.
