BIG BREAKING: తాత కాబోతున్న మెగాస్టార్… ఉపాసన మళ్ళీ ప్రెగ్నెంట్!

upasana

BIG BREAKING:  మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్య కాబోతున్నారు. నిజమేనా అంటే నిజమే.. రామ్ చరణ్-ఉపాసన దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు. మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ పాటు ఉపాసన సీమంతం వేడుకను నిర్వహించారు. ఈ మేరకు ఈ దీపావళికి సంబరాల్లో భాగంగా డబుల్ బ్లెస్సింగ్ అంటూ ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇందులో ఉపాసనకు సీట్స్ ఇస్తూ పలువురు విషెస్ చెప్పారు. ఈ ఫ్రేమ్ లో చిరు, చరణ్ కూడా ఉన్నారు. దీంతో మెగా వారసుడొస్తున్నాడంటూ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఈ సారి మగపిల్లాడు కావాలని చిరు బహిరంగంగానే అడిగిన వీడియో కూడా సోషల్ మీడియాలో  వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.. ఇక ఇప్పటికే చరణ్ ఉపాసన దంపతులకు 2023 జూన్ లో క్లీంకార జన్మించింది.మళ్లీ రెండేళ్ల తరువాత చరణ్ కపుల్స్ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.  మరోవైపు వరుణ్, లావణ్య దంపతులకు ఇటీవలే ఓ బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.