Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. దర్శకుడు రాజ్ నిడిమోరు కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ కూడా బాగానే నడుస్తోంది. చాలా సార్లు ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు కూడా వైరల్ గా మారాయి. తాజాగా వీరిద్దరూ మరోసారి వార్తల్లో నిలిచారు.
Festivities felt brighter with the sparkle of @Samanthaprabhu2’s smile 💚#Samantha #Diwali #TeluguFilmNagar pic.twitter.com/WDNMTWhgwx
— Telugu FilmNagar (@telugufilmnagar) October 20, 2025
దీపావళి పండుగను సామ్, రాజ్ ఘనంగా జరుపుకున్నారు. దర్శకుడు రాజ్ నిడిమోరు కుటుంబంతో కలిసి ఆమె దీపావళి వేడుకల్లో పాల్గొనడం, అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోతున్న సమంత.. దీపాలు వెలిగిస్తూ, పూజ చేస్తూ, చిరు నవ్వులు చిందిస్తూ కనిపించారు.
నీలిరంగు కుర్తాలో రాజ్ నిడిమోరు కూడా ఆమె పక్కనే ఉన్నారు. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అంటూ సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో దీపావళి సంబరాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. దీంతో పెళ్లి ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, రాబోయే ‘సిటడెల్: హనీ బన్నీ’ వంటి ప్రాజెక్ట్‌ల సమయంలో సమంత రూత్ ప్రభు.. దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వీరిద్దరూ తరచుగా కలిసి కనిపించడంతో డేటింగ్‌లో ఉన్నారంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా దీపావళి వేడుకల్లోనూ కలసి పాల్గొనడం.. ఈ డేటింగ్ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చిందని చెప్పాలి. అయితే, వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై అధికారికంగా మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.