kissing scenes : పేరెంట్స్‌ చెప్పిన మాటకు షాకయ్యా: సోనమ్‌ బజ్వా

తాను కెరీర్ ప్రారంభంలో ముద్దు సన్నివేశాలు ఉన్నందున అనేక బాలీవుడ్ చిత్రాలను తిరస్కరించినట్లుగా సోనమ్ బజ్వా ఇటీవల ఓ ఇంటర్వ్చూలో వెల్లడించింది.

పంజాబీ ప్రేక్షకులు, కుటుంబ ప్రేక్షకులు తాను ఇలా చేస్తే అంగీకరిస్తారా అనే భయంతోనే ఆ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు.

అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే విషయంపై తన తల్లిదండ్రులతో గురించి మాట్లాడినప్పుడు, “సినిమా కోసమే కదా, చేస్తే తప్పేమీ లేదు” అని వారు బదులివ్వడంతో తాను షాకయ్యానన్నారు.

అనవసరమైన ఊహలతో అవకాశాలు వదులుకున్నందుకు బాధపడ్డానని చెప్పారు.

కాగా సోనమ్ బజ్వా తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన బాబు బంగారం సినిమాలో ఒక పాటలో (‘దండమే పెట్టుకుంటాం’), సుశాంత్ హీరోగా వచ్చిన ‘ఆటాడుకుందాం రా’ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.

సోనమ్ బజ్వా పంజాబీ చిత్రం బెస్ట్ ఆఫ్ లక్ (2013) తో కెరీర్ మొదలైంది. అక్టోబర్ 21 న ఆమె అప్ కమింగ్ చిత్రం ఏక్ దీవానే కి దీవానియాత్ విడుదల కానుంది.