SRK : ఫస్ట్ నేషనల్ అవార్టు అందుకున్న షారుఖ్!

SRK : న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. 2023 సంవత్సరానికిగానూ ఆయనకు ఈ గౌవరం లభించింది. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందజేసింది. ఇక బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ, విక్రాంత్ మాస్సే తదితరులు జాతీయ అవార్డులను అందుకున్నారు.

ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. జవాన్ చిత్రంలో తన పాత్రకు గానూ షారుఖ్ ఖాన్ మొట్టమొదటి జాతీయ అవార్డును అందుకున్నారు. వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన 12వ ఫెయిల్ చిత్రానికి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు లభించింది. రాణి ముఖర్జీ మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ నటి అవార్డును కూడా అందుకున్నారు.తెలుగు సినిమాలకు పలు విభాగాల్లో అవార్డులు లభించడం విశేషం.

ప్రధాన విజేతలు (ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ)

ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్ (హిందీ) – దర్శకుడు: విధు వినోద్ చోప్రా
ఉత్తమ దర్శకుడు: సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ)
ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్)
ఉత్తమ నటి: రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)
ఉత్తమ సహాయ నటుడు: విజయరాఘవన్ (పూక్కాలం), ముత్తుపెట్టై సోము భాస్కర్ (పార్కింగ్)
ఉత్తమ సహాయ నటి: ఊర్వశి (ఉళ్లోళుక్కు), జానకీ బోడివాలా (వశ్)

తెలుగు సినిమాలకు లభించిన అవార్డులు

ఉత్తమ తెలుగు చిత్రం: భగవంత్ కేసరి
ఉత్తమ వీఎఫ్‌ఎక్స్ (AVGC): హనుమాన్
ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ: హనుమాన్ (నందు, పృథ్వీ)
ఉత్తమ స్క్రీన్ ప్లే: బేబి (సాయి రాజేష్ నీలం)
ఉత్తమ సాహిత్యం: బలగం (ఊరు పల్లెటూరు పాటకు కాసర్ల శ్యామ్)
ఉత్తమ గాయకుడు (మేల్ ప్లేబ్యాక్ సింగర్): రోహిత్ (బేబి సినిమాలోని “ప్రేమిస్తున్నా” పాట కోసం)
ఉత్తమ బాలనటి: సుకృతి వేణి బండ్రెడ్డి (గాంధీ తాత చెట్టు)

ఇతర ముఖ్య పురస్కారాలు

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు: మోహన్‌లాల్
ఉత్తమ ఆనిమేషన్ చిత్రం: హనుమాన్
జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను ప్రోత్సహించే ఉత్తమ చిత్రం: సామ్ బహదూర్
ఉత్తమ జనరంజక చిత్రం: రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ