BIRTHDAY : బిగ్ బాస్ ఫేమ్ దువ్వాడ మాధురికి తెలంగాణ పోలీసులు బిగ్ షాకిచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ప్రాంతంలో గల ఓ ఫామ్‌హౌస్‌లో ఆమె బర్త్‌డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అనుమతులు లేకుండా ఈపార్టీని నిర్వహిస్తున్నందుకు పోలీసులు భగ్నం చేశారు.
దువ్వాడ మాధురిఈ ఈవెంట్‌లో నిబంధనలను ఉల్లంఘిస్తూ విందు ఏర్పాటు చేయగా, సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ పార్టీలో దువ్వాడ శ్రీనివాస్‌తో సహా కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పార్టీ జరుగుతున్న ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు భారీగా మద్యం, హుక్కా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఫామ్‌హౌస్‌లో మాధురి బర్త్‌డే పార్టీ భగ్నం!
రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో దువ్వాడ మాధురి బర్త్‌డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌తో సహా కుటుంబ సభ్యులు ఈ పార్టీలో ఉన్నారు. అనుమతులు లేకుండా నిర్వహించిన ఈ ఈవెంట్‌లో 10 విదేశీ మద్యం బాటిళ్లతో పాటు… pic.twitter.com/7AUZ09oDBF
— ChotaNews App (@ChotaNewsApp) December 11, 2025
10 విదేశీ మద్యం బాటిళ్లు. 7 హుక్కా బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించడం, అలాగే నిషేధిత లేదా అనుమతులు లేని మద్యం, హుక్కా వంటి వస్తువులను వినియోగించడం నిబంధనల ఉల్లంఘనగా రాజేంద్రనగర్ పోలీసులు పరిగణించారు. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా మాధురి ఎంట్రీ ఇచ్చారు.
