champion : ఛాంపియన్ హిట్టా ఫట్టా?

champion
champion : కొన్నిసార్లు కథ కంటే కథనం సినిమాను ముందుకు నడిపిస్తూ ఉంటుంది..
ఛాంపియన్ అలాంటి సినిమానే.. ఇదేమీ తెలియని కథ కాదు..
గట్టిగా మాట్లాడుకుంటే గ తేడాది వచ్చిన రజాకర్ సినిమాను కాస్త కమర్షియలైజ్ చేసి తీశారు..
అందులోనే ఒక మంచి ఎమోషనల్ డ్రైవ్ తీసుకున్నాడు దర్శకుడు ప్రదీప్ అద్వైతం..
ఇండిపెండెన్స్ మూమెంట్ సెటప్..
అప్పటి పరిస్థితులు.. నిజాం పాలన.. రజాకార్ల అరాచకాలు..
వీటన్నింటి మధ్యలో ఇంగ్లాండ్ వెళ్లి ఫుట్బాల్ ఆడి జీవితంలో సెటిల్ అవ్వాలనుకునే ఒక యువకుడి కల..
వీటన్నింటినీ బాగానే బ్లెండ్ చేశాడు దర్శకుడు ప్రదీప్..
కథలోకి వెళ్లడానికి చాలా టైం తీసుకున్నాడు..
ఫస్టాఫ్ మొత్తం కాస్త నెమ్మదిగా వెళుతుంది..
ఇంటర్వెల్ సీన్ మాత్రం అదిరిపోయింది..
ఒక మూడు నాలుగు సీన్స్ ముందు నుంచి దానికోసం ఎమోషన్ సెట్ చేస్తూ వచ్చాడు..
అందుకే ఇంటర్వెల్ బాగా పేలింది..
అంత హెవీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత సెకండ్ ఆఫ్ మళ్లీ కాసేపు స్లో అయింది..
కొన్ని సన్నివేశాలు బాగా లాగ్ అనిపించాయి..
కాస్త కఠినంగా ఉండి కొన్ని సీన్స్ తీసేసి ఉంటే పేస్ పెరిగేది..
ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్లీ సినిమా గాడిన పడింది..
క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది..
ఎమోషన్ వైస్ గా ఛాంపియన్ ఆకట్టుకుంటుంది..
టెక్నికల్ గా టాప్ నాచ్ ఈ సినిమా.. ఈ విషయంలో వైజయంతి మూవీస్ ను మెచ్చుకోవాలి..
హీరో మార్కెట్ తో పని లేకుండా కథను నమ్మి బడ్జెట్ పెట్టారు వాళ్ళు..
రోషన్ చాలా బాగా నటించాడు.. మనోడి తెలంగాణ యాసకు నేను ఫిదా అయిపోయా..
అనస్వర రాజన్ తన పాత్రకు న్యాయం చేసింది..
మరో కీలకమైన పాత్రలో నందమూరి కళ్యాణ చక్రవర్తి అద్భుతంగా ఉన్నాడు.. 37 ఏళ్ల తర్వాత ఈయనను స్క్రీన్ మీద చూడడం బాగుంది..
మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు ప్లస్..
ఓవరాల్ గా ఛాంపియన్.. మనసులు గెలిచాడు.. కమర్షియల్ గా లెట్స్ వెయిట్ అండ్ సీ..!