Varanasi : ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్-వరల్డ్ సినిమా వారణాసి(Varanasi). గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. అయితే గ్లింప్స్ ప్లే అవుతున్న సమయంలో పదే పదే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దీంతో నిరాశకు గురైన రాజమౌళి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
హనుమాన్‌పై రాజమౌళి కామెంట్స్.. నెటిజన్ల ఫైర్ pic.twitter.com/2urUlfE6Nn
— venukumar (@venukumar4) November 16, 2025
రాజమౌళి తన స్పీచ్ లో దేవుడిపై తనకున్న నమ్మకం గురించి మాట్లాడుతూ.. “నాకు దేవుడిపైన పెద్దగా నమ్మకం లేదు. ఈ సినిమా కధ రాస్తున్నప్పుడు మా నాన్నగారు (విజయేంద్ర ప్రసాద్) ‘హనుమంతుడు వెనుకాల ఉండి ఈ సినిమా తీయించాడు..ఆయనే నడిపిస్తాడని చెప్పారు. అలా అన్నప్పుడు నాకు వెంటనే కోపం వచ్చింది. ఇదేనా నడిపించేది? అని అసహనం వ్యక్తం చేశారు.
అయితే రాజమౌళి కామెంట్స్ హిందూ మనోభావాలను దెబ్బతీసిందని హనుమాన్ భక్తులు ఆరోపిస్తున్నారు.సినిమా విజయం సాధిస్తే అది తన టాలెంట్ అనీ, వైఫల్యం లేదా ఆటంకం ఎదురైతే దేవుడి తప్పా అని రాజమౌళి ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. నాలుగు సినిమాలు హిట్ కాగానే పొగరు తలకెక్కొద్దు. మీ సినిమాలను ఎంత ఆదరించారో అంతే తొక్కి పెడతారు. హిందూ దేవుళ్లను కించపరిచి హీరోలు అవుదాం అనుకుంటున్నారు” అంటూ రాజమౌళిని ఏకిపారేస్తున్నారు.
రాజమౌళి నీ పతనం ప్రారంభః 👎
మహామహులే కాలగర్భంలో కలిసిపోయారు.
నీకు పొగరు తల కెక్కి దేముడి మీద మాట్లాడుతున్నావ్…..
దేముడంటే ఇష్టం లేదా నీకు ….?అతిసర్వత్రా వర్జ్యతేన్..
— NAMO NAMO (@VVRBSRSU) November 16, 2025
మరోవైపు రాజమౌళిని సపోర్ట్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. రాజమౌళి పనే దైవంగా భావించేవాడు కాబట్టి.. అంత ఎత్తుకు ఎదిగాడని కామెంట్లు చేస్తున్నారు. మరి రాజమౌళి దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇక ఇదే ఈవెంట్ లో రాజమౌళి ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా రాస్తున్నప్పుడు కొన్ని సీన్స్, కొన్ని డైలాగ్స్ రాస్తుంటే తాను నేల మీద లేనని, మహేశ్ బాబును రాముడిలా కనిపించాడని.. అప్పుడు తనకు గూస్ బంప్స్ వచ్చాయంటూ భావోద్వేగంగా చెప్పారు.
పనే దైవంగా భావించేవాడు రాజమౌళి అంత ఎత్తుకు ఎదుగుతాడు..
పనీపాటా లేని సన్నాసులు దేవుడి పేరు చెప్పకొని బతికేస్తారు..
ఇది నిజం..
ఇదే నిజం…
— Ram (@Prime1729X) November 16, 2025
