Bigg Boss 9 Telugu : హౌస్‌లోకి వెళ్లబోయే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వీళ్లే..!

bigg boss 9 Telugu

bigg boss 9 Telugu

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్‌లో అసలైన ఫైటు ఇంకా స్టార్ట్ కాలేదా అని అనుకుంటున్నారా? అయితే వచ్చే వారమే అసలు ఆట మొదలవుతుంది. ఎందుకంటే… ఒకేసారి ఆరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెడుతున్నారు!

ప్రస్తుతం ఇమ్మానుయేల్ వన్ మ్యాన్ షోతో కంటెంట్ ఇస్తుంటే, పవన్-కళ్యాణ్ జంటగా ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ మిగతావారు అంతగా స్పార్క్ చూపించకపోవడంతో ఆట ఫ్లాట్‌గా సాగుతోంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో సీజన్ 9 కి మళ్లీ కొత్త ఉత్సాహం రానుంది.

ఈ లిస్టులో మాధురి పేరు బాగా వినిపిస్తోంది. హీరోయిన్ లా గ్లామరస్‌గా, వివాదాల్లా ఫైరీ‌గా… ఈమె ఎంట్రీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే చివరి నిమిషం వరకు ఆమె వస్తుందా లేదా అన్నదే ప్రస్తుతం సస్పెన్స్!

అయేషా పేరు కూడా హాట్ టాపిక్. సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్‌తో ఫేమస్, తమిళ బిగ్ బాస్‌ సీజన్ 6లో 9 వారాలు నిలిచింది. కమల్ హాసన్‌కి ఎదురుగా నిలబడి హంగామా చేసింది. గ్లామర్, ఫైర్ — బిగ్ బాస్ కి కావాల్సిన రెండు పర్ఫెక్ట్ కాంబినేషన్స్.

అలాగే సినిమాల నుంచి దూరంగా ఉన్న ఒక యువ హీరో, గీత LLB సీరియల్ నటి కూడా ఈ ఎంట్రీలలో ఉన్నారని టాక్. శనివారం హౌస్‌లోకి వెళ్లే వీరి ఎపిసోడ్‌ను ఆదివారం ‘2.0’ పేరుతో గ్రాండ్ లాంచ్‌గా చూపించబోతున్నారు.