Shivani : ఫ్యాన్ వల్గర్ కామెంట్.. ఇచ్చిపడేసిన శివానీ.. దెబ్బకు డిలీట్

Shivani Nagaram : అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది హైదరాబాదీ బ్యూటీ శివానీ నాగారం. తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో లక్ష్మిపాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

తాజాగా ప్రముఖ యూట్యూబర్ మౌళి హీరోగా నటించిన లిటిల్ హార్ట్స్ సినిమాలో కాత్యాయని పాత్రలో నటించి అదరగొట్టింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో అమ్మడు బ్రాండ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఆమె సుహాస్‌తో కలిసి హే భగవాన్ అనే సినిమాలో నటిస్తుంది.

శివానీ నాగారం సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. తన అందమైన ఫోటోలను అందులో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఆమె ఫోటోలకు ఓ నెటిజన్ ఇదిగో ఈ విధంగా వల్గర్ కామెంట్ చేశాడు. దీంతో శివానీకి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే అతనికి గట్టి కౌంటర్ ఇచ్చింది.

నువ్వ నున్న ఏమైతే అన్నావో అవన్నీ మీ అమ్మకేరా అంటూ చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం ఇచ్చింది. దీంతో దెబ్బకు ఆ నెటిజన్ కామెంట్ డిలీట్ చేసి అకౌంట్ క్లోజ్  చేసుకున్నాడు. అయితే అప్పటికే ఇందుకు సంబంధించిన స్ర్కీన్ షాట్ వైరల్ గా మారిపోయింది.

వాస్తవానికి ఇలాంటి కామెంట్స్ చేసిన కొంతమంది హీరోయిన్స్ చూసి చూడనట్లు వదిలేస్తారు… కానీ శివానీ గట్టిగా ఇచ్చిపడేయడంతో మరెవరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయరు.

శివాని హైదరాబాద్‌ లోనే పుట్టి పెరిగింది. విల్లా మేరీ కాలేజీలో కామర్స్‌ డిగ్రీ కంప్లీట్ చేసింది. ఆమె మొదట ‘అంతర్గత’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ చేసింది. తర్వాత ‘మిస్టర్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చేసి తెలుగు యువతకు ముందుగానే పరిచయమైంది.