Lirisha : అరాచకం..అస్సలు గుర్తుపట్టలేం! వకీల్ సాబ్ బ్యూటీ ఇలా అయింది ఏంటి?

Lirisha : పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా గుర్తింది కదా..అందులో సూపర్ ఉమెన్ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో సూపర్ ఉమెన్ గా నటించి ఆకట్టకుంది లిరీష. అంతకుముందు ఈమె చాలా సినిమాలు చేసిన పెద్దగా పేరు రాలేదు కానీ ఈ ఒక్క సినిమాతో ఆమె బాగా క్లిక్ అయింది.

అయితే ఇప్పుడు థాయిలాండ్ పర్యటనలో ఉన్న ఆమె, అక్కడి సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అస్సలు గుర్తు పట్టకుండా మారిపోయింది ఈ వకీల్ సాబ్ బ్యూటీ. ఎరుపు,నారింజ రంగు కాంబినేషన్ ఉన్న సిల్క్ దుస్తులు, చేతిలో రంగురంగుల గొడుగుతో ఆమె కనిపిస్తున్న తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

వకీల్ సాబ్ సినిమాలో కాస్త గంభీరంగా కనిపించిన లిరీష, ఈ ఫోటోల్లో చాలా సాఫ్ట్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. అసలు ఈమె వకీల్ సాబ్ సూపర్ ఉమెనేనా? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి!