సినీనటుడు రాళ్లపల్లి కన్నుమూత

ప్రముఖ సినినటుడు రాళ్లపల్లి వెంకటేశ్వర రావు(73) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మే 17న సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురవడంతో రాళ్లపల్లిని ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని మోతీనగర్ కు తరలించారు.

1979లో కుక్కకాటుకు చెప్పు దెబ్బ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాళ్లపల్లి… శుభలేఖ, ఖైదీ, ఆలయ శిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, సితార, ఆలాపన, న్యాయానికి సంకెళ్లు లాంటి సినిమాల్లో నటించారు. తన కెరీర్ లో సుమారు 850కి పైగా చిత్రాల్లో నటించారు. కమేడియన్ గా ఎంట్రీ ఇచ్చినా.. విలక్షణ పాత్రలకు ప్రాణం పోశారు. తెలుగు, తమిళ భాషల్లో హాస్యనటుడిగా ప్రేక్షకాదరణ పొందారు. మూడు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమకు ఆయన సేవలందించారు. 1955 అక్టోబర్ 10న తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో జన్మించారు. చిన్నతనం నుంచే నాటకాలంటే ఆయనకు మక్కువ. ఆ ఇష్టంతోనే 1979లో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. విలక్షణ నటుడిని సినీ ఇండస్ట్రీ కోల్పోయిందని ప్రముఖ నటులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

LEAVE A REPLY