ఆర్టీసీ సమ్మె ముగుస్తుందా ? ఆర్టీసీనే ముగుస్తుందా ? కేబినెట్ భేటీపై ఉత్కంఠ..!

ఆర్టీసీ సమ్మె ముగుస్తుందా ? ఆర్టీసీనే ముగుస్తుందా ? కేబినెట్ భేటీపై ఉత్కంఠ..!

“ఆర్టీసీ సమ్మె ముగింపు అంటూ ఆర్టీసీ ముగింపే.. అంతకుమించి మరో ఆప్షన్ లేదు”. హుజూర్ నగర్ గెలుపు తర్వాత సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలివి. ఈ నేపథ్యంలో నవంబర్ 2న జరగబోయే కేబినెట్ భేటీపై ఉత్కంఠ రేపుతోంది. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కీలకంగా ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాలపైనే కేబినెట్‌లో చర్చించనున్నట్టు సమాచారం. ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితిపై మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించనుంది. ఇందులో భాగంగా రూట్ల ప్రైవేటీకరణపై ఓ విధాన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రూట్ల ప్రైవేటీకరణపై దృష్టి సారించిన ప్రభుత్వం… ఆ తర్వాత మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఆర్టీసీలో సంస్కరణలు :
ఆర్టీసీలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు సీఎం కేసీఆర్. భవిష్యత్తులో ఆర్టీసీ సమ్మెల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కీలక నిర్ణయాలు అవసరమని రీసెంట్ గా జరిగిన మీడియా సమావేశంలో ఆయన అన్నారు. అద్దె బస్సుల సంఖ్యను పెంచడం, పలు రూట్ పర్మిట్లకు అనుమతి ఇచ్చే అంశంపై అధికారులు నివేదిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసీలో 22 శాతం అద్దె బస్సులు ఉన్నాయి. మరో 8 శాతం అద్దె బస్సులకు ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక కొత్తగా 20 శాతం ప్రైవేటు బస్సులకు కూడా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర, సీఎం కేసీఆర్ అనుమతి ఇస్తూ సంతకం చేస్తే… ఈ నిర్ణయాలన్నీ అమల్లోకి వస్తాయని సమాచారం. దీంతో ఆర్టీసీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో సీఎం కేసీఆర్ ఆ ఒక్క సంతకం చేయడానికి సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక… ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చే సమాధానం…. శనివారం నాటి కేబినెట్ మీటింగ్ తో…ఆర్టీసీ సమ్మె ముగింపా ? లేకపోతే ఆర్టీసీ ముంగిపా ? అన్నది తేలిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *