గెలిచిన జోష్ : హుజూర్ నగర్ పై సీఎం కేసీఆర్ వరాల జల్లు

గెలిచిన జోష్ : హుజూర్ నగర్ పై సీఎం కేసీఆర్ వరాల జల్లు

హుజూర్ నగర్ లో సీఎం కేసీఆర్ ఎన్నికల సభ వర్షం కారణంగా రద్దైనా…టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలిచిన తర్వాత కేసీఆర్ సభలో వరాల జల్లు కురిపించారు. హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఎన్నడూలేని విధంగా వరాలు ఇచ్చారు, హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో రెసిడెన్షియల్‌ స్కూల్‌ మంజూరు చేస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో బంజారాభవన్‌ను కూడా నిర్మిస్తాం. హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌లో పోడుభూముల సమస్యను పరిష్కరిస్తాం. హుజూర్‌నగర్‌కు రెవెన్యూ డివిజన్‌ మంజూరు చేస్తాం. ఈఎస్‌ఐ ఆస్పత్రి, పాలిటెక్నిక్‌ కాలేజీని ఏర్పాటు చేస్తాం. హుజూర్‌నగర్‌లో కోర్టును కూడా ఏర్పాటు చేస్తాం. భారీగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరు చేస్తాం. ప్రతిపక్షాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాయి. 1997లో ఎన్టీఆర్‌ హయాంలో కరవు మంత్రిగా పనిచేశాను. నల్గొండ ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశాను’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. హుజూర్ నగర్ పరిధిలో 134 గ్రామ పంచాయతీలకు రూ.25లక్షల చొప్పున ఏడు మండల కేంద్రాలకు 30లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. రోడ్ల అభివృద్ధికి రూ. 25 కోట్లు మంజూరు చేస్తామన్నారు. నేరేడుచెర్ల మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు ఇస్తామని కేసీఆర్ ఈ సభాముఖంగా చెప్పారు. ఇక ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నవారి కోరిక మేరకు ఈఎస్ఐ హాస్పిటల్ కోసం కేంద్రంతో మాట్లాడతాం అన్నారు. ఇలా హుజూర్ నగర్ పై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *