ఆర్టీసీ విలీనం ప్రసక్తే లేదు.. CM కేసీఆర్ సంచలన నిర్ణయం

ఆర్టీసీ విలీనం ప్రసక్తే లేదు.. CM కేసీఆర్ సంచలన నిర్ణయం

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చేశారు సీఎం కేసీఆర్. దాంతోపాటు… ఆర్టీసీలో సమూల మార్పులకు ఆమోద ముద్ర వేశారు. ప్రైవేట్ బస్సులు, రూట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 5100 రూట్లు, బస్సులను ప్రైవేట్‌ బస్సులకు అనుమతిస్తున్నామని తెలిపారు. లాభాలు వచ్చే రూట్లలోనే ఆర్టీసీ బస్సులను నడుపుతామని.. ఆర్టీసీకి నష్టాలు వచ్చిన రూట్లలో ప్రైవేట్ బస్సులను నడుపుతామని స్పష్టం చేశారు. కొత్తగా వచ్చిన కేంద్ర చట్టం ప్రకారమే ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు :

  • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని తీర్మానం
  • 5100 రూట్లు, బస్సులను ప్రైవేట్‌ బస్సులకు అనుమతి
  • ఆర్టీసీకి నష్టాలు వచ్చే రూట్లలోనే ప్రైవేట్ బస్సులను నడుపుతాం
  • ప్రైవేట్ బస్సుల్లోనూ విద్యార్థులు, జర్నలిస్టులు, వికలాంగుల బస్ పాసులు చెల్లుబాటవుతాయి
  • ప్రైవేట్ రూట్లకు అనుమతించవచ్చని కేంద్ర ప్రభుత్వమే చట్టం చేసింది
  • ఆ చట్టం ప్రకారమే ప్రైవేట్ ట్రావెల్స్‌కు పర్మిట్లు ఇస్తున్నాం.
  • ఆర్టీసీ కార్మికులకు 67శాతం జీతాలు పెంచాం
  • ఆర్టీసీకి ఉన్న 8 వేల బస్సుల్లో 2 వేల బస్సులు మార్చాలి.
  • ఇది చట్టవిరుద్దమైన సమ్మె. పనికి మాలిన డిమాండ్
  • బ్లాక్ మెయిల్ విధానానికి స్వస్తి పలకాలి
  • ఆర్టీసీ,ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది.
  • ఆర్టీసీ కార్మికుల పొట్టకొట్టే ఉద్దేశం లేదు.
  • కార్మికులకు మరో ఛాన్స్ ఇస్తున్నాం
  • నవంబరు 5లోపు సమ్మె చేస్తున్న కార్మికులంతా డ్యూటీలో చేరవచ్చు
  • డ్యూటీలో చేరే కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాం
  • ఆలోపు డ్యూలీలో చేరకపోతే ఉద్యోగం ఊడినట్లే..
  • ప్రస్తుతం 50 శాతం ట్రావెల్స్‌కు అనుమతిస్తున్నాం.
  • నవంబరు 5 లోపు విధుల్లో చేరకుంటే 100శాతం ప్రైవేట్‌కే అప్పగిస్తాం
  • కార్మికుల ఆత్మహత్యలకు ప్రతిపక్షాలు, యూనియన్లే కారణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *