LPG cylinder prices : కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెడుతున్న రోజే సామాన్యులకు, ముఖ్యంగా వ్యాపార వర్గాలకు చమురు సంస్థలు ఊహించని షాకిచ్చాయి. ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) గ్యాస్ ధరలను(LPG cylinder prices) సవరించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను ఒక్కోదానికి రూ. 49 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి.
Oil marketing companies have increased the #prices of commercial #LPG gas cylinders. The rate of the 19 KG commercial LPG gas cylinder has been increased by Rs 49, effective from today, 1st Feb.
In Delhi, the retail sale price of 19kg commercial LPG cylinder is now Rs 1740.50… pic.twitter.com/U3x73QpSy8
— JK Media (@jkmediasocial) February 1, 2026
ఈ పెంపుతో ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో రూ. 1,740.50గా, హైదరాబాద్ లో రూ.1,912.50గా, ముంబైలో రూ. 1,692.00గా, కోల్‌కతాలో రూ. 1,844.50గా, చెన్నైలో రూ.1,899.50గా ఉంది.
వరుసగా రెండో నెల కూడా వాణిజ్య గ్యాస్ ధరలు పెరగడం వ్యాపార వర్గాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సర్వీసులు, చిరు వ్యాపారుల నిర్వహణ వ్యయం పెరగనుంది. గత ఏడాది నవంబర్, డిసెంబర్లలో ధరలు కొంత తగ్గినప్పటికీ, జనవరిలో ఏకంగా రూ. 111 పెరగడం, ఇప్పుడు మళ్ళీ రూ. 49 పెరగడం వారికీ ఆందోళన కలిగిస్తోంది.
ఇక కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ, ఇంట్లో వాడే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. దీనివల్ల సాధారణ గృహ వినియోగదారులకు కొంత ఉపశమనం లభించినట్లయింది. గృహ వినియోగ గ్యాస్ ధరలు 2025 ఏప్రిల్ నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి.
Also Read:
