నోటికాడికొచ్చిన ముద్దను తన్నడమంటే ఇదేగావొచ్చు. కాస్తా ముందో వెనకో పక్కా పీసీసీ అవుతుండే. సీనియర్లు ఎవరెన్ని సాటీలు చెప్పినా… యూత్ లో రేవంత్ కి క్రేజ్ ఉన్నదన్నది వాస్తవం. ఆ క్రేజ్ తో పార్టీని మరింత బలోపేతం చేసే ఛాన్సుంది. ఆ విషయం కాంగ్రెస్ హైకమాండ్ కు కూడా తెలుసు. కానీ.. ఇపుడే ఎందుకులే తొందరా అని వేచిచూస్తోంది అధిష్టానం. దానికితోడు ఓటుకు నోటు కేసు కూడా ఓ అడ్డంకి. ఇవన్నీ ఇలా ఉంచితే… వచ్చే ఎన్నికల్లోపు రేవంత్ కు పార్టీ పగ్గాలు అప్పగించడం మాత్రం ఖాయం. ఎందుకంటే..ఇప్పుడున్న కాంగ్రెస్ నేతల్లో ఆయనకు మించిన యంగెస్ట్, మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ ఎవరూ లేరనే చెప్పాలి. కానీ…అంతలోనే తొందరపడ్డారేమో అనేది పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న టాక్.

ఆమె వెనకున్నది ఆయనేనా ?

రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన లీడర్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా….టీడీపీలో ఇప్పటికీ ఆయనకు మూలాలున్నాయనేది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ కండువా కప్పుకున్నా… రేవంత్ ఎన్నడూ టీడీపీని గానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుని గానీ పల్లెత్తి మాట కూడా అనలేదు. అనడు కూడా. ఆ పరిచయాలతో హుజూర్ నగర్ లో టీడీపీని పోటీ నుంచి తప్పించి, కాంగ్రెస్ కు మద్ధతిప్పించేది ఉండే….కానీ అది జరగలే. టీడీపీ తన అభ్యర్థిగా కిరణ్మయ్ ను ప్రకటించడం, ఆమె నామినేషన్ వేయడం కూడా జరిగిపోయింది. అయితే..దీని వెనకాల ఉండి నడిపించేది మొత్తం… రేవంత్ రెడ్డేనని ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు ఢిల్లీకి కంప్లైట్ చేశారట. తను ప్రకటించిన అభ్యర్థిని కాదని… ఉత్తమ్ పద్మావతికి హుజూర్ నగర్ టికెట్ ఇవ్వడంతో రేవంత్ ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ కు ఇవ్వాలనుకున్న పీసీసీని పక్కన పెట్టి.. ఢిల్లీ పిలిపించుకుంటున్నట్లు తెలుస్తోంది. పర్సనల్ ఇగోలతో పార్టీకి నష్టం చేకూర్చడంపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అందుకే రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారనే వార్తలు వస్తున్నాయి. పార్టీ పెద్ద పోస్ట్ ఇద్దామనుకుంటే…ఇలా వెన్నుపోటు పొడుస్తాడా అంటూ.. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ పై అసహనంతో ఉన్నారు.