ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన తొలి హత్య : పోలీసుల అదుపులో నిందితుడు సురేష్

అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు కూర సురేష్ ముదిరాజ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. 40 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చెప్పారు. కూర సురేష్ కు బారారంలోని సర్వే నంబర్ 92, 93లో 7 ఎకరాల భూమి ఉందని… ఆ భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాల వ్యవహారంలోనే ఈ హత్య జరిగినట్టు భావిస్తున్నామని సీపీ తెలిపారు. అబ్దుల్లాపూర్ మెట్ ఘటనస్థలాన్ని పరిశీలించారు సీపీ. మధ్యాహ్నం 1.15 గంటలకు సజీవదహనం ఘటన జరిగినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన తొలి ఘటన ఇదని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ జరిగేలా చర్యలు తీసుకుంటామని నిందితుడిని కఠినంగా శిక్షించేలా చేస్తామన్నారు. నిందితుడికి ఉరిశిక్ష పడేలా చూస్తామన్నారు సీపీ మహేష్ భగవత్.