Doreen Romel Shemo : 20 ఏళ్లకే ఇంటర్నెట్‌ను షేక్.. ఎవరీ బ్యూటీ!

Doreen Romel Shemo

Doreen Romel Shemo :ఇంటర్నెట్ ప్రపంచంలో ఎప్పుడు ఎవరు పాపులర్ అవుతారో అస్సలు చెప్పలేం. రాత్రికి రాత్రే స్టార్లు అయిపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు అదే లిస్టులోకి చేరింది ఇరాక్ వాలీబాల్ ప్లేయర్ డోరీన్ రోమెల్ షెమో (Doreen Romel Shemo).

ప్రస్తుతం భారతీయ ఇంటర్నెట్ యూజర్లలో ఈమె పేరు మారుమోగిపోతోంది. ఆమె అందం, అమాయకమైన ముఖ కవళికలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది! నెటిజన్లు ఆమెను రకరకాల స్టైలిష్ డ్రెస్సుల్లో చూడాలని ఆరాటపడుతున్నారు. వారి కోరికను తీర్చడానికి రంగంలోకి దిగింది ఎక్స్ కు చెందిన ఏఐ టూల్ ‘గ్రోక్’

ఏం జరుగుతోంది? యూజర్లు అడుగుతున్నదే తడవుగా, ‘గ్రోక్’ ఏఐ ఈ వాలీబాల్ సుందరిని రకరకాల కాస్ట్యూమ్స్ లో చూపిస్తోంది. పద్ధతైన దుస్తుల నుంచి ట్రెండీ వేర్ వరకు.. డోరీన్ ఫోటోలను ఏఐ క్రియేట్ చేస్తుంటే, అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాలీబాల్ కోర్టులో మాత్రమే చూసిన ఆమెను, ఇలా సరికొత్త లుక్స్‌లో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

డోరీన్ రోమెల్ ఇరాక్ దేశానికి చెందిన వాలీబాల్ క్రీడాకారిణి. 2006లో జన్మించిన ఈమె వయస్సు ప్రస్తుతం 20 ఏళ్లు. ఇరాక్ జాతీయ మహిళా వాలీబాల్ జట్టులో సభ్యురాలిగా ఉన్న ఈమె, తన అద్భుతమైన ఆటతీరుతో పాటు అందంతోనూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కేవలం వాలీబాల్ మాత్రమే కాకుండా, 15 ఏళ్ల వయస్సు నుండి ఇరాక్ జాతీయ బాస్కెట్‌బాల్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించడం విశేషం.