రూటు మారింది : సినిమాల వైపు చూస్తున్న నారా లోకేష్..!

అనుకున్నదొక్కటి… అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా..” నారా లోకేష్ పరిస్థితి ఇలాగే ఉందిప్పుడు. రెండో సారి అధికారంలోకి వచ్చి…ఏపీని ఏలేద్దామనుకుంటే ప్రజలిచ్చిన అనూహ్య తీర్పుకు దిమ్మతిరిగి బొమ్మ కనపడుతుంది. కేవలం 23 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలే గెలుచుకుంది టీడీపీ. ఇక ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. వద్దంటే వెళ్లాను మంగళగిరికీ అన్నచందంగా మారిపోయింది. టీడీపీ కంచుకోటలైన నియోజకవర్గాలను వదిలేసి.. మంగళగిరికెళ్లి ఘోరమైన ఓటమిని చవిచూశారు లోకేష్. ఇప్పుడేం చేయాలి. ఇంకో ఐదేళ్లదాకా రాజకీయాల్లో మనం చేసేది ఏమీ లేదు… పార్టీ సంగతి నాన్నగారు చూసుకుంటారు… మరి నేనేటి చేసేది అని… రాజకీయాలు పక్కన పెట్టి సినిమా రంగం వైపు చూస్తున్నారట నారా లోకేష్. ఎలాగూ మామ బాలకృష్ణ, సోదరుడు నారా రోహిత్ సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. దీంతోపాటు నందమూరీ హీరోలు ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్నారు. అందుకనీ…లోకేష్ కూడా రాజకీయాలు పక్కన పెట్టిన ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ గా అవతరామెత్తాలని చూస్తున్నారట.

దీనికి సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వరుస సినిమాలు తీయాలని లోకేష్ భావిస్తున్నట్లు సమాచారం. చాలావరకు నారా ఫ్యామిలీతో సినిమా వాళ్లకు పరిచయాల ఉన్నాయి. ఇక హీరోలకు కూడా కొదవ లేదు. దీంతో ఇప్పుడు సినిమాలపై ఫోకస్ పెట్టారు లోకేష్. ఎలాగో తమ పార్టీ అధికారంలోకి రాలేదు. పెద్దగా సీట్లు కూడా గెలవలేకపోయింది. దీంతో ఇక ఈ ఐదేళ్ల పాటు బిజినెస్ చేసుకోవాలన్న ఆలోచనలో పడ్డారు లోకేష్. అందుకే సినీ ఇండస్ట్రీ పై కన్నేశారు. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకులు ఎవరైనా సరే బిజినెస్‌లు చేసుకుంటుంటారు. ఇప్పుడు లోకేష్ కూడా అదే తరహాలో కొత్త బిజినెస్ మ్యాన్ అవతార మెత్తుతున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

తెలంగాణ అవతరణ దినోత్సవం పాట 2019 

LEAVE A REPLY