Best Business ideas : చాలామంది సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటారు కానీ, లక్షల్లో పెట్టుబడి పెట్టాలంటే భయపడతారు. నిజానికి తెలివితేటలు ఉంటే కేవలం 50 వేల రూపాయలతో కూడా నెలకు మంచి ఆదాయం వచ్చే బిజినెస్లు మొదలుపెట్టవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మొదటిది, పేపర్ ప్లేట్లు మరియు కప్పుల తయారీ. ప్రస్తుతం ప్లాస్టిక్ వాడకం తగ్గించమని ప్రభుత్వం చెబుతోంది కాబట్టి, పేపర్ ప్లేట్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఒక చిన్న పేపర్ ప్లేట్ మేకింగ్ మెషిన్ 25 నుండి 35 వేల రూపాయలకే దొరుకుతుంది. మిగిలిన డబ్బుతో ముడి పదార్థాలు కొనుగోలు చేయవచ్చు. వీటిని తయారు చేసి ఫంక్షన్ హాల్స్, హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు సరఫరా చేస్తే మంచి లాభాలు ఉంటాయి.
రెండవది, మొబైల్ రీసెల్, రిపేరింగ్ షాప్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొని, వాటిని చిన్న చిన్న రిపేర్లు చేసి మళ్ళీ లాభానికి అమ్మవచ్చు. అలాగే ఫోన్లకు గ్లాస్ గార్డులు, బ్యాక్ కవర్లు వంటివి హోల్సేల్ రేటుకు తెచ్చి అమ్ముకోవచ్చు. 50 వేల పెట్టుబడితో ఒక చిన్న కౌంటర్ లేదా గదిలో ఈ బిజినెస్ మొదలుపెట్టి, రోజువారీ ఖర్చుల కంటే ఎక్కువే సంపాదించవచ్చు.
మూడవది, ఫ్రెష్ జ్యూస్, మిల్క్ షేక్ పాయింట్. ముఖ్యంగా వేసవి కాలం వస్తోంది కాబట్టి, జ్యూస్ సెంటర్లకు తిరుగుండదు. ఒక మంచి జ్యూస్ మిక్సర్, ఐస్ బాక్స్, పండ్ల స్టాక్ కోసం 30 నుండి 40 వేల రూపాయలు సరిపోతాయి. ఒక చిన్న తోపుడు బండి మీద లేదా షాపు ముందు చిన్న స్థలంలో దీనిని ఏర్పాటు చేసుకోవచ్చు. నాణ్యతగా, శుభ్రంగా జ్యూస్ ఇస్తే కస్టమర్లు క్యూ కడతారు. ఇందులో సగానికి సగం లాభం ఉంటుంది.
నాలుగోది ప్రస్తుత కాలంలో కల్తీ లేని వస్తువులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. మనం రోజూ వాడే కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటివి బయట కొంటే చాలా వరకు కల్తీ జరుగుతున్నాయనే భయం అందరిలోనూ ఉంది. అందుకే, మీరు కేవలం 50 వేల రూపాయల పెట్టుబడితో ‘హోమ్ మేడ్ మసాలా పౌడర్స్’ బిజినెస్ మొదలుపెడితే మంచి లాభాలు పొందవచ్చు. ఈ వ్యాపారానికి పెద్దగా చదువు లేదా అనుభవం అక్కర్లేదు, కేవలం నాణ్యమైన ముడి పదార్థాలను సేకరించి వాటిని పొడి చేసి ప్యాక్ చేయడం తెలిస్తే చాలు.
