Land vs Gold : 2026లో మీ దగ్గర ఉన్న డబ్బు ఎక్కడ పెడితే డబుల్ అవుతుంది?

Gold vs Land

Land vs Gold : మనం కష్టపడి సంపాదించిన రూపాయిని ఎక్కడ దాచుకుంటే రేపు అది మనల్ని కాపాడుతుంది? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మన తాతల కాలం నుండి ఉన్న రెండు నమ్మకమైన దారులు.. ఒకటి బంగారం, రెండోది భూమి. అయితే 2026లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏది మనకు ఎక్కువ లాభాన్ని ఇస్తుంది? ఎక్కడ రిస్క్ తక్కువ? ఒకసారి క్లియర్‌గా చూద్దాం.

బంగారం అనేది కేవలం నగ కాదు, అది ఒక ఎమర్జెన్సీ ఫండ్. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బంగారాన్ని అమ్మి నగదుగా మార్చుకోవచ్చు. దీనినే లిక్విడిటీ అంటారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తక్కువ మొత్తంలో డబ్బు ఉన్నవారికి గోల్డ్ కాయిన్స్ లేదా డిజిటల్ గోల్డ్ ఒక వరం.

భూమిని నమ్ముకున్న వాడు ఎప్పుడూ చెడిపోడు అని అంటుంటారు. ఇది నిజమే కానీ దీనికి కొంత ఓపిక, ఎక్కువ పెట్టుబడి కావాలి.ఒక ఏరియాలో డెవలప్‌మెంట్ వస్తుందని తెలిస్తే, అక్కడ కొన్న చిన్న ప్లాటు కూడా కొన్ని ఏళ్లలో కోట్లు పలుకుతుంది. భూమి కొనేటప్పుడు డాక్యుమెంట్లు పక్కాగా ఉండాలి. లేదంటే లాభం పక్కన పెడితే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.

మీ దగ్గర లక్షల్లో డబ్బు ఉంది, పదేళ్ల వరకు ఆ డబ్బు అవసరం లేదు అనుకుంటే రియల్ ఎస్టేట్ బెస్ట్ ఆప్షన్. లేదు, నా దగ్గర తక్కువ డబ్బు ఉంది, అవసరమైతే వెంటనే డబ్బులు కావాలి అనుకుంటే బంగారం వైపు వెళ్లడమే తెలివైన పని.

ఎప్పుడూ మీ దగ్గర ఉన్న డబ్బునంతా ఒకే చోట పెట్టకండి. కొంత బంగారం మీద, కొంత భూమి మీద, మరికొంత సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచుకోవడం వల్ల మీ ఆర్థిక భవిష్యత్తు సేఫ్‌గా ఉంటుంది.

 

 

 

 

 

 

క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి 5 ఈజీ టిప్స్ మీ లివర్ డేంజర్‌లో ఉందని చెప్పే 7 లక్షణాలు! బాడీలో నీళ్లు తగ్గాయని చెప్పే 7 వార్నింగ్స్ సంక్రాంతి పుంజులు ‘అఖండ-2’: టికెట్ రేట్లు పెంపు సమంత, రాజ్‌ ఆస్తులెంత? దసరా భామలు సీడ్ సైక్లింగ్‌ ఎలా చేయాలంటే? ఏ చర్మానికి ఏ ఫేస్‌వాష్ వాడాలో తెలుసా? కాళ్లకు పసుపు ఎందుకు రాస్తారంటే..