Personal Loan : తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న పర్సనల్ లోన్ ఎలా వస్తుంది?

Personal Loan

Personal Loan :  ఈ రోజుల్లో అత్యవసరంగా డబ్బు కావాలన్నా లేదా ఏదైనా ప్లాన్ చేసుకున్నా అందరికీ గుర్తొచ్చేది పర్సనల్ లోన్. కానీ, బ్యాంకులు లోన్ ఇచ్చే ముందు అడిగే మొదటి ప్రశ్న – మీ సిబిల్ స్కోర్ ఎంత? అనే. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటేనే బ్యాంకులు లోన్ ఇస్తాయి. మరి మీ స్కోర్ 600 లేదా అంతకంటే తక్కువ ఉంటే పరిస్థితి ఏంటి? అసలు లోన్ రాదా? కంగారు పడకండి. తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నా పర్సనల్ లోన్ పొందే కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

పెద్ద పెద్ద బ్యాంకులు (SBI, HDFC వంటివి) సిబిల్ స్కోర్ విషయంలో చాలా కఠినంగా ఉంటాయి. కానీ NBFCలు (Non-Banking Financial Companies) అంటే బజాజ్ ఫిన్‌సర్వ్, ముత్తూట్ ఫైనాన్స్, టాటా క్యాపిటల్ వంటి సంస్థలు కొంచెం వెసులుబాటు ఇస్తాయి. అయితే, ఇక్కడ ఒక చిన్న మైనస్ ఏంటంటే.. వీరు వడ్డీ రేటు (Interest Rate) సాధారణం కంటే కొంచెం ఎక్కువగా వసూలు చేస్తారు.

మీ సిబిల్ స్కోర్ బాలేకపోయినా, మీ ఇంట్లో ఎవరికైనా మంచి సిబిల్ స్కోర్ మరియు స్థిరమైన ఆదాయం ఉంటే, వారిని Co-applicant గా చేర్చుకోండి. వారి క్రెడిట్ హిస్టరీ బాగుంటే, బ్యాంకు మీకు లోన్ ఇచ్చే అవకాశం 90% పెరుగుతుంది.

గతంలో మీరు క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టకపోవడం వల్ల స్కోర్ తగ్గి ఉండవచ్చు. కానీ ప్రస్తుతం మీ జీతం పెరిగి ఉండొచ్చు లేదా మీకు అదనపు ఆదాయం వస్తూ ఉండొచ్చు. మీ Salary Slips లేదా Bank Statements చూపించి నేను ఇప్పుడు లోన్ కట్టగల స్థితిలో ఉన్నానని బ్యాంకు అధికారులను ఒప్పించగలిగితే లోన్ వచ్చే అవకాశం ఉంటుంది.

నేరుగా రూ. 5 లక్షలు లేదా రూ.10 లక్షల లోన్ అడిగితే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అందుకే మొదట రూ.20,000 నుండి రూ.50,000 వరకు చిన్న లోన్ తీసుకోండి. దీనివల్ల రిస్క్ తక్కువ కాబట్టి బ్యాంకులు లోన్ ఇస్తాయి. ఆ లోన్‌ను కరెక్ట్ టైమ్‌కి కడితే, మీ సిబిల్ స్కోర్ పెరిగి భవిష్యత్తులో పెద్ద లోన్లు వస్తాయి.

ఒకవేళ పర్సనల్ లోన్ దొరకనప్పుడు, సెక్యూర్డ్ లోన్స్ ఉత్తమ మార్గం. మీ దగ్గర ఉన్న బంగారం లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ పై లోన్ తీసుకోండి. వీటికి సిబిల్ స్కోర్‌తో అసలు సంబంధమే ఉండదు. వడ్డీ రేట్లు కూడా పర్సనల్ లోన్ కంటే తక్కువగా ఉంటాయి.

లోన్ రావడం లేదని కంగారులో ప్లేస్టోర్‌లో కనిపించే ప్రతి యాప్‌లోనూ మీ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయకండి. కొన్ని ఫేక్ లోన్ యాప్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఎప్పుడూ RBI రిజిస్టర్డ్ యాప్స్ లేదా బ్యాంకులను మాత్రమే నమ్మండి.