Girija Oak : గత నాలుగైదు రోజులుగా GirijaOak అనే మరాఠీ నటి దేశ వ్యాప్తంగా అలాగే ట్రెండింగ్ లోకి వచ్చింది. అలా అని ఆమె గ్లామరస్ హీరోయిన్ కాదు. ఇంటర్వ్యూలోనూ కాంట్రవర్సీలు ఏం మాట్లాడలేదు. అయినా సరే ఈమె గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. సందీప్ కిషన్ నటించిన ShorintheCity అనే హిందీ సినిమాలో అతడికి జోడీగా గిరిజ ఓక్ నటించింది.
ఇద్దరి మధ్య ఒక ఘాటైన లిప్ లాక్ సీన్ కూడా ఉంది. ప్రస్తుతం గిరిజ ‘థెరపీ షెరపీ’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఆమె నీలిరంగు చీర, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో ఉన్న ఫోటో వైరల్ కావడంతో ఆమె ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో డిసెంబర్ 27, 1987న జన్మించిన ఆమె 2011లో చిత్రనిర్మాత సుహృద్ గాడ్‌బోలేను వివాహం చేసుకుంది.ఈమె మరాఠీ నటుడు గిరీష్ ఓక్ కుమార్తె.

