తేజ సజ్జ హీరోగా వచ్చిన మిరాయ్ సినిమాలో హీరోయిన్ గా రితికా నాయక్ నటించింది. 2019లో మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన రితికా, పలు మోడలింగ్ పోటీల్లో విజేతగా నిలిచింది.
2022లో వచ్చిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు లభించడంతో పాటు, ఉత్తమ డెబ్యూ నటిగా సైమా (SIIMA) అవార్డుకు కూడా నామినేట్ అయ్యింది.
నాని హీరోగా వచ్చిన ‘హాయ్ నాన్న’ సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.
‘మిరాయ్’ సినిమాలో ఒక బౌద్ధ సన్యాసిని పాత్రలో కనిపించింది. ఈ పాత్ర కోసం చాలా శ్రమించి, తన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. సినిమా ప్రమోషన్లలో ఈ పాత్ర కోసం తాను ఎంతగా కష్టపడింది వివరించింది
అశోకవనంలో అర్జున కళ్యాణం’ తర్వాత తాను ఒక మంచి, బలమైన పాత్ర కోసం చూస్తున్నానని, ‘మిరాయ్’ తనకు ఆ అవకాశం కల్పించిందని తెలిపింది.