Jabardasth : స్టేజీ పైన గట్టిగానే ప్రపోజ్ చేశాడు!

ప్రతి శుక్రవారం శనివారం తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షోగా నిలిచిన జబర్దస్త్‌ ఈ వారం సరికొత్త హంగామాతో సిద్ధమైంది. ప్రేక్షకులను మరింతగా అలరించేందుకు కమెడియన్లు సిద్ధం చేసిన స్కిట్‌లు నవ్వులు పూయించనున్నాయి. తాజా విడుదలైన ప్రోమోలో ఓ ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. కమెడియన్ ప్రవీణ్ స్టేజీపైనే నటి యామినికి లవ్ ప్రపోజ్ చేశాడు.