pallavi Dora : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల పక్కన ఆమె స్నేహితురాలిగా, పల్లవి అనే పాత్రలో నటించిన పల్లవి డోర ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.
కేవలం అందంతోనే కాదు, అద్భుతమైన నటనతోనూ పల్లవి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో ఒక అత్యంత కీలకమైన, భావోద్వేగభరితమైన సీన్‌లో ఆమె నటించింది. అత్యాచార బాధితురాలిగా ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాలో చాలా పద్ధతిగా, డీ-గ్లామర్ రోల్‌లో కనిపించిన పల్లవి.. బయట మాత్రం అందుకు పూర్తి రివర్స్. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ యంగ్ బ్యూటీ చేసే రచ్చ మామూలుగా లేదు.
తన హాట్ ఫోటోషూట్స్‌తో కుర్రకారు మతి పోగొడుతోంది. ట్రెండీ అవుట్‌ఫిట్స్ ధరిస్తూ ఫ్యాషన్ ఐకాన్‌గా మారుతోంది. సినిమా రిలీజ్ టాక్ మొదలైనప్పటి నుండి ఆమె ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఒక పెద్ద సినిమాలో ఛాన్స్ రావడం, పైగా పవన్ కల్యాణ్ లాంటి స్టార్ పక్కన నటించే అవకాశం దక్కడం పల్లవికి పెద్ద ప్లస్ పాయింట్. తన నటనకు మంచి మార్కులు పడటంతో, ముందు ముందు మరిన్ని మంచి ఆఫర్లు వస్తాయో చూడాలి.
అంతకుముందు ఈ బ్యూటీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి కూతురుగా నటించి ఆకట్టుకుంది.

