హీరోయిన్ రాశిసింగ్ తన లవ్ స్టోరీ బయటపెట్టింది. 17 ఏళ్ల వయసులో లెక్చరర్‌తో ప్రేమలో పడ్డానంది.

పరీక్షల టైంలో ముందే తనకు ఆయన క్వశ్చన్ పేపర్ లీక్ చేసేవాడని, వైవా జరిగే సమయంలోనూ తనను ప్రశ్నలు కూడా అడిగేవాడు కాదంది.

ఆ రూమ్‌లో పది నిమిషాల పాటు సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లం. మా లెక్చరర్ కూడా చాలా యంగ్‌గా చూడటానికి ఎంతో బాగుండేవాడు. అయినా మేం హద్దు దాటలేదు.

మా లెక్చరర్‌కి పెళ్లి జరగ్గా.. ఆయన ఇప్పటికీ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నాడని చెప్పింది. అంతేకాకుండా ఆయన భార్య కూడా తనను ఫాలో అవుతోందని వెల్లడించింది.

తెలుగులో వరుసగా సినిమాల్లో నటిస్తున్న రాశి సింగ్ త్వరలో 3 రోజెస్ సిరీస్ 2వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇది ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో రాశి సింగ్ తన ప్రేమకథను వెల్లడించింది.
