BIGG BOSS సీజన్‌-9లో బిగ్‌ ట్విస్ట్‌

BIgg boss

ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-9 లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

టాప్ కంటెస్టెంట్‌లలో ఒకరైన రీతూ చౌదరి హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

ఈ వారం నామినేషన్లలో తనూజ,భరణి, సుమన్ శెట్టి, సంజన, రీతూ చౌదరి, డీమాన్ పవన్ ఉన్నారు.

గత కొన్ని వారాలుగా ఓటింగ్‌లో సుమన్ శెట్టి, సంజన చివరి స్థానాల్లో (లీస్ట్ ఓటింగ్) ఉండేవారు.

అయితే, గత వారం జరిగిన గొడవ కారణంగా సంజనకు ఒక్కసారిగా ప్రేక్షకుల మద్దతు పెరిగి, ఓటింగ్‌లో ఆమె రెండవ స్థానానికి చేరుకుంది.

దీనితో, ఈ వారం డేంజర్ జోన్‌లో సుమన్ శెట్టితో పాటు రీతూ చౌదరి ఉన్నట్లుగా సమాచారం.

ఊహించని విధంగా టాప్ కంటెస్టెంట్‌గా ఉన్న రీతూ చౌదరి హౌస్ నుంచి ఔట్ అయినట్లుగా  ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, బిగ్‌బాస్ సీజన్-9లో కళ్యాణ్ పడాల తొలి ఫైనలిస్ట్‌గా నిలిచి టాప్ 5 లోకి ఎంటర్ అయినట్లుగా  కూడా వార్తలు వస్తున్నాయి.

రీతూ చౌదరి ఎలిమినేషన్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. రాత్రి 10 గంటలకు క్లారిటీ రానుంది.