Faria Abdullah : చిట్టి నాగిని వైబ్స్.. చూసి తట్టుకోగలరా?

Faria Abdullah : అందాల భామ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాతిరత్నాలు మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ తో చిట్టిగా కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది.

అయితే ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా అంతటి గుర్తింపును అందుకోలేకపోయింది. హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన ఫరియా ఇప్పుడు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తోంది.

గాయనిగా.. డ్యాన్సర్ గా మెరుస్తోంది. సినిమాలతోపాటు బుల్లితెరపై పలు షోల్లో కనిపిస్తోంది. గతేడాది ‘మత్తు వదలరా 2’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా మారింది.

ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో చిట్టి కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది.

తాజాగా చిట్టి గ్రీన్ కలర్ డ్రెస్ లో అందాలను ఆరబోసి హీటెక్కించింది. ఈ పిక్స్ కు ‘మీకు కొన్ని ‘నాగిని వైబ్స్ ‘ పంపిస్తున్న ‘అంటూ సరదా క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.