Mana Shankara Vara Prasad Garu: చిరును సీరియల్లో హింసించిన ఈ బ్యూటీ ఎవరంటే?

Mana Shankara Vara Prasad Garu

Mana Shankara Vara Prasad Garu:  మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12నవిడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన అతిథి పాత్రలో కనిపించి థియేటర్లలో సందడి చేశారు.

ఈ సినిమాలో చిరు చూసే  ఓ సీరియల్ లో కనిపించే నటి ఎవరనే చర్చ నడుస్తోంది. ఆమె పేరు సాయి ప్రియ రెడ్డి అలియాస్ చరిష్మారెడ్డి. ఈమె ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. తెలుగులో కల్లోలం లాంటి షార్ట్ మూవీస్ లో నటించింది. సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.