Today Gold Price Hyderabad : రూ.9 వేలు పెరిగిన బంగారం…హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Today Gold Price Hyderabad

Today Gold Price Hyderabad : పసిడి ప్రియులకు ఇది నిజంగా గుండె ఆగే వార్తే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాలు, ముడి చమురు ధరల ప్రభావంతో ఇవాళ దేశీయ మార్కెట్లో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది.(Today Gold Price Hyderabad )

సాధారణంగా బంగారం ధర వందల్లో లేదా వెయ్యి రూపాయల లోపు పెరుగుతుంటుంది. కానీ ఇవాళ ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై సుమారు రూ.9,000 వరకు పెరగడం మార్కెట్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అటు వెండి కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక్కరోజే కిలోకు రూ.14,000 మేర పెరిగింది.

హైదరాబాద్‌లో నేటి తాజా ధరలు ఇవే: భాగ్యనగరంలో నేటి ధరలను పరిశీలిస్తే:

24 క్యారెట్ల10 గ్రాములు: రూ.1,61,100

22 క్యారెట్ల10 గ్రాములు: రూ.1,41,900

కిలో వెండి ధర: రూ.3,30,000

పెరుగుదలకు కారణాలేమిటి?

గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ విలువ పడిపోవడం, యుద్ధ వాతావరణం లేదా ఇతర ఆర్థిక అనిశ్చితి కారణాల వల్ల మదుపర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. అందుకే డిమాండ్ పెరిగి ధరలు ఈ స్థాయిలో పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న సమయంలో ఈ ధరల పెరుగుదల సామాన్యులకు పెను భారంగా మారింది.