బంపరాఫర్ : కేవలం ఒకేఒక్క రూపాయకు.. రూ. 12వేల ఫోను..!

అవును నిజం. కేవలం రూపాయి అంటే రూపాయికే 12వేల రూపాయల విలువ గల ఫోను దొరుకుంతుంది. చైనా దిగ్గజమైన హానర్ స్మార్ట్ ఫోన్ ఈ బంపరాఫర్ ప్రకటించింది. భారతీయ  వినియోగదారులకోసం ఫ్లాష్‌ సేల్ ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 11న  ఈ ప్రత్యేకంగా ఈ విక్రయాన్ని చేపట్టబోతోంది. ఈ సేల్‌లో హానర్‌ 9ఎన్‌  (3 జీబీ, 32 జీబీ స్టోరేజ్‌) స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఒక రూపాయికే అందించనుంది.  అయితే….హానర్‌ 9ఎన్‌  3 జీబీ, 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్  అసలు రేటు రూ. 11,999గా ఉంది.

(వచ్చే మంగళవారం) సెప్టెంబర్ 11న ఉదయం 11 గంటల 45 నిమిషాలకు హానర్ వెబ్‌సైట్ ద్వారా ఈ ఫ్లాష్ సేల్ నిర్వహిస్తుంది. అయితే ఇది కేవలం కంపెనీ వెబ్‌సైట్, స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.  లిమిటెడ్‌ డివైస్‌లపై అందిస్తున్న ఈ ఆఫర్‌ను దక్కించుకోవాలంటే  హానర్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో రిజిస్టర్‌ చేసుకొని వ్యకిగత వివరాలను నమోదు చేయాలి.  అలాగే  ఆన్‌లైన్‌  చెల్లింపులకు మాత్రమే అనుమతి.  వీటితో పాటు….ఈ ఫ్లాష్‌ సేల్‌ ద్వారా హానర్ 7ఎస్‌, హానర్ 9ఎన్‌, హానర్ ప్లే  ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది.

హానర్ అఫీషియల్ వెబ్ సైట్ కోసం క్లిక్ చెయ్యండి

LEAVE A REPLY