హుజూర్ నగర్ ఉప ఎన్నిక రాష్ట్రంలో హాట్ టాఫిక్. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య అసలైన పోటీ అనుకుంటున్న వేళ బీజేపీ, టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించడంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే ఇందులో సీపీఐ, సీపీఎం మద్దతు కీలకం కానుంది. టీఆర్ఎస్  సైదిరెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చింది. దీంతో ఈసారి గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక తన ఇలాక హుజూర్ నగర్ ను మరోసారి తమ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణీ పద్మను గెలిపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.  బీజేపీ కూడా తన అభ్యర్థీ గెలుపు కోసం కష్టపడుతోంది. అయితే ఈ పోటీలో కొత్త పొత్తు తెరపైకి రావడం అందరిని ఆశ్చర్యానీకి గురి చేస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ మద్దతు తెలపడం…. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ కు మింగుడు పడటం లేదు. అనుహ్యంగా సీపీఐ టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్  తికమక అవుతోంది. శాసన సభ ఎన్నికల్లో కూటమిలో భాగమై…ఓడిపోయిన తర్వాత కూడా టీఆర్ఎస్ ను తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిన సీపీఐ మద్ధతు ఇవ్వడం వెనుక మతలబు ఇతర పార్టీల వారికి అర్ధం అవడం లేదు. ఇక సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడంతో వారి మద్ధతు ఎవరికి ఉంటుందనేదే ఆసక్తిగా మారింది. లోగడ మరో అంశం చర్చకు వస్తోంది. సీపీఎం కావాలనే తన అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే మరో విషయం ఏంటంటే నిజానికి సీపీఐ సీపీఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టిన గెలిచే పరిస్థితి లేదు. అయితే ఒకప్పటి ఉద్యమాల గడ్డ, మావోయిస్టుల ప్రాభల్యం ఉన్న ఏరియా కాబట్టి క్యాడర్ కొంత పనికొచ్చే అంశం. దీంతో పాటు ఎంతో కొంత ఓటు షేర్ ఉన్న పార్టీలు కాబ్టటి మిగతా పార్టీలకు వీరి మద్దతు ఉపయోగ పడే అంశం. ఇక టీడీపీ నుంచి అభ్యర్థి కిరణ్మయి నిలబెట్టడంతో గెలిచే పరిస్థితి లేకున్న ఓట్లు చీల్చేప్రయత్నం మాత్రం జరుగుతుందని విశ్లేషకుల భావన. సూర్యాపేట జిల్లాలో టీడీపీ కింది స్ఠాయిలో క్యాడర్ ఎంతోకొంత యాక్టీవ్ గా ఉంది. ఇక ఏపీకి బార్డర్ కాబట్టి అక్కడ ఆంధ్రా వారు కూడా బానే ఉన్నారు. దీంతో టీడీపీకి కలిసొస్తుందని వారి ఆలోచన.  టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపడంతో ఇపుడు కాంగ్రెస్  కు తలనొప్పి పరిస్థితి ఎదురైంది. కాంగ్రెస్ కు రావాల్సిన ఓట్లు చీల్చుతారనే భావనలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ ద్వారా చీలిపోతుందేవోనని కాంగ్రెస్ భయపడుతోంది. దీంతో చంద్రాబుబుతో సంప్రదింపులు కూడా జరిపారు. ఇక సీపీఎం మద్దతు టీడీపీకే ఇవ్వాలని కోరారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీకి సీపీఎం మద్దతు కీలకం కానుంది. ఇక బీజీపీ ఒంటరిగా ఎవరి మద్ధతు లేకుండా పోటీలోకి దిగింది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలతో ఊపుమీద ఉండటంతో గట్టి పోటీ ఇస్తాం అంటోంది.

అయితే టీఆర్ఎస్ కు బరిలో మిగతా పార్టీల వల్ల లాభం చేకూరే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా…సైదిరెడ్డిపై సింపతి, టీఆర్ఎస్ బలం, సీపీఐ మద్దతు కూడగట్టుకుని గెలిచి నిలబడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇటు కాంగ్రెస్ కూడా ఉత్తమ్ కు ఉన్న పట్టు…కాంగ్రెస్ బలం తమను గెలిపించి తీరుతాయని అంటున్నారు.  ఉప ఎన్నిక కూడా ఇంత రసవత్తరంగా జరగడంతో అక్కడ ఎవరి గెలుస్తారోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.