ఏపీ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం ఇవాళ (అక్టోబర్ 1) కోర్టులో లొంగిపోయారు. కోడెల పదవిలో ఉండగా కే ట్యాక్స్‌ పేరిట శివరాం కబ్జాలు, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలో తనకు బెయిల్‌ ఇవ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు కోడెల శివరాం. ఆయన అభ్యర్థనపై స్పందించిన హైకోర్టు.. శివరాంను కింది కోర్టులో లొంగిపోవాల్సింగా సూచించింది. ఇవాళ నరసరావుపేట ఫస్ట్‌ మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో లొంగిపోయారు.

కోడెల శివరాం

అయితే… కే ట్యాక్స్‌ పేరుతో ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంపై….. కోడెల కుటుంబంపై జనాలు ఫిర్యాదు చేయడం, సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత, పార్టీ అధిష్టానం సైతం పట్టించుకోకపోవడంతో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కోడెల ఆత్మహత్య తర్వాత ఆయన కుమారుడు కోర్టులో లొంగిపోవడంపై రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.