డ్యూటీకి బంక్ కొట్టి ‘సైరా’ సినిమాకెళ్లిన ఎస్సైలు… వారిపై….

డ్యూటీకి బంక్ కొట్టి ‘సైరా’ సినిమాకెళ్లిన ఎస్సైలు… వారిపై….

ఇవాళ దేశవ్యాప్తంగా మెగస్టార్ చిరంజీవి నటించిన సైరా విడుదలైంది. అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్బంగా ఈ సినిమాను విడుదల చేశారు. అయితే చిరు ఫ్యాన్స్ రాత్రి నుంచే థియేటర్లకు క్యూకట్టారు. ఆ క్యూలో కొందరు ఏపీ పోలీసులు కూడా ఉన్నారు. సైరా కోసం రాత్రంతా పడికాపులు కాశారు. కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్సైలు సైరా సినిమాకు వెళ్లారు. వేకువజామున కోవెలకుంట్లలో ఆరుగురు ఎస్సైలు ‘సైరా’ సినిమాకు వెళ్లారు. అయితే..ఆన్ డ్యూటీలో ఉండి సినిమాకు వెళ్లడంపై పైఅధికారులు సీరియస్ అయ్యారు. ఎవరికీ చెప్పాపెట్టకుండా సినిమాకు వెళ్లిన ఆ ఆరుగురు ఎస్సైలను వీఆర్‌కు బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప. బదిలీ వేటు పడినవారిలో …అవకు ఎస్‌ఐ శ్రీకాంత్‌ రెడ్డి, కొలిమిగుండ్ల ఎస్‌ఐ జగదీశ్వర్‌ రెడ్డి, నందివర్గం ఎస్‌ఐ హరిప్రసాద్‌, బండి ఆత్మకూర్‌ ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య, రాచర్ల ఎస్‌ఐ ప్రియతంరెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ అశోక్‌ ఉన్నారు.

డ్యూటీకి బంక్ కొట్టి సినిమా చూస్తున్న ఎస్సైలు

అయితే..మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా’ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 4620 థియేటర్లలో సైరా విడుదలైంది. ఇక ఏపీలో ఈ సినిమా అదనపు షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అక్టోబర్‌ 2 నుంచి 8 తేదీ వరకు స్పెషల్‌ షోలకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. ప్రతి రోజు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం పది గంటల వరకు స్పెషల్‌ షో లకు అనుమతించింది. రివ్యూలు పాజిటివ్‌గా ఉండటం, చిరు నటన అద్భుతంగా ఉందన్న ప్రశంసలు వినిపిస్తుండటంతో.. సైరాపై మరింత ఎటెన్షన్ క్రియేట్ అయింది.