మన దేశంలో, 30-40 సంవత్సరాల వయస్సు గల వారు గుండెపోటు కారణంగా అకస్మాత్తుగా మరణిస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి తర్వాత గుండెపోటుతో మరణించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎవరు? ఎప్పుడు? ఎక్కడ గుండెపోటు వచ్చి చనిపోతారో ఊహించడం కష్టమైంది. కానీ భారత్ పోలిస్తే ఇతర దేశాలలో వృద్ధులు 100 సంవత్సరాల వయస్సు వరకు సజీవంగా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు.
సుదూర జపాన్‌లో, ఆరోగ్య, కార్మిక, సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం నారా ప్రిఫెక్చర్‌కు చెందిన రిటైర్డ్ డాక్టర్ షిగేకో కగావా వయస్సు ఇప్పుడు 114 సంవత్సరాలు. మియోకో హిరోయాసు మరణం తర్వాత ఆమె జపాన్‌లో జీవించి ఉన్న అత్యంత వృద్ధురాలుగా రికార్డు సృష్టించింది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు వైద్య కళాశాల నుండి పట్టభద్రురాలు అయిన ఈమె యుద్ధ సమయంలో ఒసాకాలోని ఒక ఆసుపత్రిలో పనిచేశారు. తరువాత గైనకాలజిస్ట్‌గా ఓ క్లినిక్‌ను నడిపారు. 86 సంవత్సరాల వయస్సులో రిటైర్ అయ్యారు.
తన దీర్ఘాయువు రహస్యాన్ని ఒక మీడియా సంస్థకు వెల్లడిస్తూ కగావా ఇలా అన్నాడు, “నా దీర్ఘాయువు రహస్యం ఏమిటంటే నేను ప్రతిరోజూ కొంత సమయం ఆడుకోవడానికి కేటాయించాను. నా శరీరంలోని బలమే నా గొప్ప ఆస్తి. నేను కోరుకున్న చోటికి వెళ్తాను, నాకు కావలసినది తింటాను. నాకు కావలసినది చేస్తాను. మొత్తంమీద, నేను చాలా స్వతంత్రురాలిని అని తెలిపారు. 1911లో జన్మించిన ఈమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
జపాన్‌లో వృద్ధుల జనాభా పెరుగుతూనే ఉంది. సెప్టెంబర్ 1, 2024 నాటికి, రికార్డు స్థాయిలో 36 మిలియన్ల మంది – లేదా జనాభాలో 29% మంది – 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు, ఇది ప్రపంచంలోనే అత్యధిక వృద్ధుల నిష్పత్తి. 80 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఇప్పుడు జనాభాలో 10% ఉన్నారు. జపాన్‌లో ఇప్పుడు 95,119 మంది శతాధిక వృద్ధులు ఉన్నారు.