బిగ్ బాస్ క్యూటీ : తమిళ్ ఫీవర్ లోస్లియా మరియన్సేన్

తమిళనాడులో వాటర్ ప్రాబ్లం సంగతేమో గానీ ఇపుడో ట్రెండ్ నడుస్తోందక్కడ. లోస్లియా ఫీవర్ తో ఊగిపోతోంది తమిళనాడు. తమిళ్ బిగ్ బాస్ లో ఈ చిన్నది అరవ యువకుల మనసులు కొల్లగొట్టింది. సినీ ఇండస్ట్రీలో కాకుండా ఇంత అందం బిగ్ బాస్ లోకి ఎలా వచ్చిందబ్బా… గుండెల్ని పిండేస్తోందని తమిళ్ యూత్ కోడై కూస్తున్నారు. చూపు తిప్పుకోకుండా.. ఛానెల్ మార్చుకోలేనంత అడిక్ట్ అయిపోయారంటే నమ్ముతారా ? ప్రతీరోజు ఆమె కోసమే టీవీలకు అతుక్కుపోతున్నారంటే ఎంతలా అడిక్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. షో చూస్తూ ఆమె స్క్రీన్ షాట్స్ తీసి ఫోన్లలో స్టేటస్ లు, డీపీలుగా పెట్టుకునేంతలా యువత గుండెల్లో తిష్టవేసింది లోస్లియా. టిక్ టాక్, షేర్ చాట్, హెలో లాంటి యాప్స్ లో లోస్లియానే ట్రెండింగ్.

ఇంతకీ ఎవరీ లోస్లియా ? : లోస్లియా మరియన్సేన్. తమిళ్ బిగ్ బాస్ షోలో ఓ కంటెస్టెంట్. ఆమె ఆడిపాడి, ఆటపట్టిస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఎవరీ లోస్లియా. తను శ్రీలంకకు మోడల్ కమ్ టీవీ యాంకర్. ఆమె తండ్రి పేరు మరియాసేన్. పూర్తి పేరు కంటే లోస్లియాగానే సుపరిచితం. ఇంటర్మీడియట్ వరకూ ఊళ్లోనే చదువుకున్నా.. డిగ్రీ చేసేందుకు కొలంబియా వెళ్లింది. అక్కడే సెటిల్ అయింది. సినిమాల్లో ట్రై చేస్తూ.. మోడల్ గా, టీవీ యాంకర్ గా రాణిస్తోంది. అలా స్టార్ టీవీ కంట్లో పడింది. తమిళం మూలాలుండటంతో బిగ్ బాస్ కు ఎంపికైంది. గతంలో శ్రీలంక మోడల్ గా పనిచేస్తూ బిగ్ బాస్ తో క్రేజ్ తెచ్చుకుని బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. జాక్వెలిన్ బాలీవుడ్ లోకొచ్చేస్తుందేమో అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో లోస్లియా ఆర్మీ పేరుతో ఓ సైన్యమే ఉందామెకి. అంతేనా తలైవీ(ఐరన్ లేడీ) అని బిరుదిచ్చేశారు.

LEAVE A REPLY