నెలకు రూ.42 లక్షలు, ఏడాదికి రూ.5 కోట్ల ప్యాకేజీ : వండర్ స్టూడెంట్

పంజాబ్ జలంధర్ కు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని టెక్ వరల్డ్ కు షాకిచ్చింది. నెలకు రూ.42 లక్షల జీతం. ఏడాదికి రూ.5 కోట్ల ప్యాకేజీతో క్యాంపస్ సెలెక్షన్స్ లో సెలెక్ట్ అయింది. పంజాబ్ జలంధర్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీ.టెక్ ఫైనల్ ఇయర్(CSE) చదువుతున్న తాన్య అరోరాకు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వచ్చే సమ్మర్ లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ క్యాంపస్ లోని R&D సెంటర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేరనుంది తాన్యా అరోరా. 2019లో ఓ స్టూడెంట్ ఇంత భారీ మొత్తంలో ప్యాకేజీ అందుకున్నది తాన్యానే. తాన్యాను చూసి గర్విస్తున్నట్టు LPU ఛాన్స్ లర్ అశోక్ మిట్టల్ అన్నారు.

తాన్యా అరోరా

‘‘చాలా ఎక్జ్సైటింగ్ గా ఉంది. మైక్రోసాఫ్ట్ కంపెనీలో సమ్మర్ ఇంటర్న్ షిప్ చేశాను. అదో గొప్ప అనుభవం. మైక్రోసాఫ్ట్ కు సెలెక్ట్ అవడంతో నా కల నెరవేరింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండాలన్నదే నా లక్ష్యం. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి టెక్ వరల్డ్ ట్రెండ్స్ పై పట్టు సాధించాలనుకుంటున్నారు. నా  కెరీర్ ని తీర్చిదిద్దిన లవ్లీ యూనివర్సిటీకి ధన్యవాదాలు’’ అని తాన్యా అరోరా సంతోషం వ్యక్తం చేసింది. ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలోని ఆపిల్, గూగుల్, హెచ్పీ, అమెజాన్, యాహూ లాంటి దిగ్గజ సంస్థల్లో గత మూడేళ్లుగా LP యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎంతోమంది జాబ్స్ పొందారు.