సినిమా చూస్తున్నంత సేపు రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయం.. స్వతంత్ర్య పోరాటంలో జరిగిన ఎన్నో విషయాలను కళ్లకు కట్టినట్టుగా చూపించడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. కొన్ని సన్నివేశాలు గుండెళ్ను హత్తుకుంటాయి. తొలిసారి చారిత్రక పాత్రలో నటించిన మెగాస్టార్ చరిత్రలో నిలిచిపోతారు. జాతీయ అవార్డే ఆయనకోసం వేచిచూసేంత అత్యద్భుతంగా నటించారు. నిజంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇలాగే ఉండేవారేమో అని అనిపించేలా…ఆ పాత్రలో జీవించారు చిరంజీవి. భారీ బడ్జెట్ తో నిర్మించిన సైరాను… తెలుగురాష్ట్రాల కంటే ముందే చూసే అవకాశం యూఎస్ తెలుగు ప్రేక్షకులకు దక్కింది. అమెరికాలో చాలా థియేటర్లలో ఫస్ట్ ప్రీమియర్ షో పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది… సినిమాకు ప్లస్ పాయింట్స్ ఏంటీ ? మైనస్ పాయింట్స్ ఏంటో తెలుసుకునే ముందు అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం…

1846 జూన్ లో నరసింహ్మారెడ్డి తన నెలసరి భరణం కోసం తన అనుచరున్ని కోయెలకుంట్ల పంపుతాడు. అక్కడి తహశీల్దార్ ఆ వ్యక్తిని, నరసింహారెడ్డిని తిట్టి… నరసింహారెడ్డి వస్తేనే భరణం ఇస్తానని పొమ్మనడంతో ఉయ్యాలవాడ నరసింహ్మారెడ్డి తిరుగుబాటు మొదలైంది.

నరసింహారెడ్డి తాత జయరామిరెడ్డి కాలంలోనే… అంటే క్రీస్తు శకం 1800 సంవత్సరంలోనే బ్రిటీష్ వాళ్లు నుస్సాం సంస్థానాన్ని లోబర్చుకుని ఈ రాజవంశానికి 11 రూపాయల భరణాన్ని ఏర్పాటు చేస్తారు. క్రీస్తు శకం 1845 వరకు ఈ భరణం నర్సింహ్మారెడ్డికి వస్తూ ఉండేది. కానీ ఆ సంవత్సరం తనకు రావాల్సిన భరణం రాకపోవడంతో… కోయెలకుంట్లలో ఉన్న తహశీల్దార్ దగ్గరకు తన భటున్ని పంపుతాడు నరసింహారెడ్డి. అయితే ఆ తహశీల్దార్ భటుడికి భరణం ఇవ్వకపోగా… నరసింహారెడ్డిని అవమానపర్చేలా భూతులు తిట్టి పంపించేస్తాడు. ఆ భటుడు ఉయ్యాలవాడకు పోయి జరిగింది చెప్తాడు. అది విన్న నరసింహారెడ్డి అవమానం ఫీలై… 500 మంది బోయ సైనికులను తీసుకుని కోయెలకుంట్లపై దండెత్తుతాడు. తహశీల్దార్ ను పట్టుకుని, ధనాగారంలో ఉన్న హరిసింగ్ ను చంపి, దానిని దోచుకుని.. కచ్చేరి అంతా కాల్చేసి, తహశీల్దార్ శిరస్సును, హరిసింగ్ శిరస్సును తెచ్చుకుని నయనాలప్ప కొండలో గల ఒక శివాలయం గుహలో వాళ్ల తలలను దాచేస్తాడు. దాంతో బ్రిటీష్ ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపుతుంది. కెప్టెన్ నార్త్, కెప్టెన్ వాట్సన్ ల నాయకత్వంలో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుతిరిగిపోతాయి. రెడ్డిని పట్టి ఇచ్చిన వారికి వేల రూపాయల బహుమానాన్ని బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటిస్తుంది. అటు నరసింహారెడ్డి కూడా వేల కొద్ది సైన్యాన్ని సమకూర్చుకుంటాడు. గిద్దలూరు దగ్గర వాట్సన్ తో ఘోర యుద్ధం చేస్తాడు. అయితే ఆ యుద్ధంలో రెడ్డి తన సైన్యాన్ని కోల్పోవడంతో నలమల కొండలలోకి తప్పించుకుని పారిపోతాడు. ఆంగ్లేయులు నరసింహారెడ్డిని పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ… ఫలించలేదు.

తర్వాత కొన్ని రోజులకు కెప్టెన్  వాట్సన్ నాయకత్వంలో వచ్చిన సైన్యం గిద్దలూరు దగ్గర విడిది చేస్తున్న సమయంలో.. అర్ధరాత్రి రెడ్డి తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటీష్ సైన్యాన్ని ఉరికిస్తాడు. దీంతో మరింత కోపంతో ఊగిపోయిన బ్రిటీష్ ప్రభుత్వం… రెడ్డి కుటుంబ సభ్యులను బంధిస్తుంది. దానికి స్వతాగ నరసింహారెడ్డి సోదరుడే సహాయం చేస్తాడు. తన కుటుంబ సభ్యులను విడిపించుకోవడానికి కడప చేరుకుంటాడు రెడ్డి. 1846 అక్టోబర్ 6న నల్లమల కొండలోని పేరుసోమల వద్దగల జగన్నాథ ఆలయంలో రెడ్డి ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్  కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడిస్తాడు. నరసింహారెడ్డి దగ్గర పనిచేసే వంటమనిషి సాయంతో బ్రిటీష్ ప్రభుత్వం రెడ్డి బంధించి కోయెలకుంట్లకు తీసుకొస్తారు. కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమే కాకుండా… హత్యలకు, దోపిడీలకు పాల్పడినట్లు తీర్పు చెబుతూ ఉరిశిక్ష విధిస్తారు. 1847 ఫిబ్రవరి 22న ఉదయం ఏడు గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటీష్ ప్రభుత్వం. విప్లవకారులను భయభ్రాంతులకు గురి చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయెలకుంట కోటలో ఉరికొయ్యకు వేలాడదీసే ఉంచారు.

ఇక సినిమాలో పస్ల్ పాయింట్స్ విషయానికొస్తే…
– మెగస్టార్ చిరంజీవి జీవించేశాడు.
– నయనతార, సేతుపతి పాత్రలో ఒదిగిపోయారు.
– విజువల్ ఎఫెక్ట్ సూపర్.. బాహుబలి తర్వాత మళ్లీ అలాంటి విజువల్ వండర్ ఈ సినిమాలో కనిపిస్తుంది.
– అమిత్ త్రివేది మ్యూజిక్ ఆకట్టుకుంటుంది…బీజీఎం కూడా.
– యాక్షన్ సన్నివేశాలు చాలా డిఫరెంట్ గా.. హాలీవుడ్ మేకింగ్ స్టైల్ లో ఉన్నాయి.

ఇక మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే…
– ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే తెలవడం.
– సినిమా లెంత్ కూడా ఎక్కువగా ఉండడం..
– కామెడీ లేకపోవడం
– మెగాస్టార్ నుంచి ఏదోఒక స్టెప్ ఆశించే ఫ్యాన్స్ కు నిరాశ

మొత్తానికి తొలిసారి చారిత్రక పాత్రలో నటించిన చిరంజీవి చరిత్రలో నిలిచిపోతారు. ప్రతీ సినీ ప్రేక్షకుడు చూడాల్సిన సినిమా….సైరా.
రేటింగ్ : 4.0/5