Bigg Boss 3 ఫినాలేలో బిత్తిరి సత్తిలా మారిన మెగస్టార్ చిరంజీవి..!

Bigg Boss 3 ఫినాలేలో బిత్తిరి సత్తిలా మారిన మెగస్టార్ చిరంజీవి..!

బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్ గా వచ్చారు మెగస్టార్ చిరంజీవి. టైటిల్ విన్నర్ కు అవార్డు ప్రజెంటేషన్ కు వచ్చిన చిరు… హౌజ్ మేట్స్ అందరితో ఫుల్ ఎంజాయ్ చేశారు. నవ్వులు పూయించారు. కామెడీతో అందరినీ ఆకట్టుకున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి సప్పగా సాగిన…ఫినాలే చిరు రాకతో ఫుల్ గ్రాండ్ మారింది. స్టేజ్ మీదున్న హౌజ్ మేట్స్ లో, బయట టీవీలు చూసే ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ వచ్చింది. దానికి తోడు చిరు పండించిన కామెడీ, ఆయన ఇచ్చిన ఫెర్ఫామెన్స్ అందరినీ కట్టిపడేశాయి.

బిత్తిరి సత్తిలా మారిన మెగస్టార్

హౌజ్ మేట్స్ అందరితో మాట్లాడుతూ వచ్చిన చిరంజీవి… శివజ్యోతి దగ్గరకు వచ్చేసరికి…బిత్తిరి సత్తిలా మారిపోయారు. శివజ్యోతిని అక్క అని సంబోధిస్తూ…బిత్తిరి సత్తిలా మాట్లాడారు. చెఫ్పక్కా….మాకు ఫఫ్ఫన్నం తిన్నట్టుందీ అంటూ.. సత్తి స్టైల్ లో అదరగొట్టేశారు. అంతేకాదు… బిత్తిరి సత్తి మేనరిజమైన చేతి వేళ్లు వంకరగా పెట్టిమరీ యాక్టింగ్ చేశారు చిరు. మొత్తానికి మెగస్టార్ చిరంజీవి రాక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఫుల్ ఫిల్ అయిందని అనుంటున్నారు ప్రేక్షకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *