బిగ్ బాస్ 3 ఫినాలే : అదరగొట్టిన చిరు… నవ్వులే… నవ్వులు…

బిగ్ బాస్ 3 ఫినాలే : అదరగొట్టిన చిరు… నవ్వులే… నవ్వులు…

బిగ్ బాస్ 3 గ్రాండ్ ఫినాలే…సాయంత్రం ఆరు గంటలకు స్టార్టయింది. రాత్రి తొమ్మిది, తొమ్మిదున్నర దాకా సప్పగా, బోరింగ్ గా సాగిన బిగ్ బాస్ ఫినాలే…మెగస్టార్ చిరంజీవి రాకతో ఒక్కసారిగా హీటెక్కింది. సైరా టైటిల్ సాంగ్ లో చిరు ఎంట్రెన్స్ అదరిపోయింది. చిరు వచ్చిన తర్వాత…ఫినాలేకే గ్రాండ్ లుక్ వచ్చేసింది. ఎంట్రీలోనే కాదు..టైమింగ్ లోనూ, కామెడీలోనూ పండించేశారు చిరంజీవి. బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చిన తర్వాత… హౌజ్ మేట్స్ ఒక్కరితో మాట్లాడిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిరు మాట్లాడుతున్నంత సేపు…..నవ్వులే నవ్వులు. చాలా రోజుల తర్వాత చిరంజీవి నుంచి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఆశ్వాదించారు ప్రేక్షకులు.

చిరంజీవి స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత… బిగ్ బాస్ హౌజ్ మేట్స్ ని పరిచయం చేస్తానంటాడు నాగార్జున.. కానీ.. చిరంజీవి వీళ్లంతా నాకు తెలుసు అని ఒక్కొక్కరితో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ పునర్నవితో స్టార్ట్ చేస్తాడు. అప్పుడు నాగార్జున….పునర్నవిని పునర్నవిగారూ అనాలి అంటూ చిరుకు చెప్పడంతో…చిరు కామెడీ స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి ఫుల్ నవ్వించేశాడు చిరు. మరీ ముఖ్యంగా రోహిణి ఐలవ్ యూ చెప్పడం, దాని తర్వాత రాయలసీయ యాసలో రోహిణి డైలాగులకు చిరంజీవి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ బిగ్ బాస్ సీజన్ మొత్తానికే హైలైట్ అనుకోవాలి. అంతబాగా యాక్ట్ చేశారు. తర్వాత హేమ, శివజ్యోతి, బాబా బాస్కర్, అలీ రెజా, జాఫర్ తో కూడా కాస్త కామెడీ పండించారు చిరంజీవి. మొత్తానికి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకే కాదు… ఈ సీజన్ మొత్తానికి చిరంజీవి సన్నివేశాలు హైలైట్ అని చెప్పాలి.