నిమ్మగడ్డకు ఇంగిత జ్ఞానం లేదు…..

నిమ్మగడ్డకు ఇంగిత జ్ఞానం లేదు…..

ఎస్ఈసి నిమ్మగడ్డ ఇవాళ సంచలన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డిని ఈ నెల 21 వరకు ఇంటికే పరిమితం చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. మీడియాతో కూడా మాట్లాడనివ్వొద్దని ఆదేశించారు. దీనిపై స్పందించిన పెద్దిరెడ్డి నిమ్మగడ్డపై సీరియస్‌ అయ్యారు. నిమ్మగడ్డ ఒక మ్యాడ్‌ ఫెలో అని… మంత్రిని ఇంట్లో నిర్బంధించాలనడం దుర్మార్గమని ఫైర్‌ అయ్యారు. నిమ్మగడ్డ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. నిమ్మగడ్డ ఇలాంటి ఆదేశాలు ఇస్తారని తాను ముందే ఊహించానని అన్నారు. తన మీద ఆదేశాలు ఇచ్చే ముందు అవి అమలవుతాయో లేదో చూసుకోవాలని రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చారు పెద్దిరెడ్డి. నిమ్మగడ్డకు ఇంగిత జ్ఞానం లేదని.. నిమ్మగడ్డ ఆదేశాల్ని ఖాతరు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిమ్మగడ్డ ఆదేశాల్ని పాటించే వారిపై భవిష్యత్‌లో చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి పెద్దిరెడ్డి. నిమ్మగడ్డలాగే టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు.