రూమర్స్ నమ్మొద్దు… బిగ్ బాస్ 3 విన్నర్ పై నాగార్జున సంచలన ట్వీట్

రూమర్స్ నమ్మొద్దు… బిగ్ బాస్ 3 విన్నర్ పై నాగార్జున సంచలన ట్వీట్

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు, వీడియోలు వస్తున్నయి. రాహుల్ సిప్లిగంజ్ గెలిచేశాడని, ఆయన తన ఇంటి దగ్గర సంబురాలు చేసుకున్నారన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. దాంతో రాహుల్ కు పోటీ ఇచ్చిన శ్రీముఖి ఫ్యాన్స్ చాలా ఫీలయ్యారు. ఈ నేపథ్యంలో హోస్టర్ నాగార్జున చేసిన ట్వీట్ ఒకటి సంచలనంగా మారింది. బిగ్ బాస్ విన్నర్ పై వస్తున్న రూమర్స్ నమ్మొద్దని…అసలు విన్నరు ఎవరో నేను ఇవాళ సాయంత్రం ప్రకటిస్తానంటూ ట్వీట్ చేశారు నాగార్జున. అది కూడా బిగ్ బాస్ లైవ్ స్ట్రీమింగ్ అంటూ సంచలనం రేపాడు. దాంతో ఒక్కసారిగా సీన్ అంతా తలకిందులు అయిపోయింది. నాగార్జున చెప్పడంతో అసలు విన్నర్ రాహులా ? శ్రీముఖినా ? అన్న అనుమానాలు మొదలయ్యాయి.

ఇదీ ఓ స్ట్రాటజీ :

అసలు బిగ్ బాస్ అనేది….లీకుల మీద బాగా ఆధారపడి ఉంటుంది. ముందు రోజు ఎపిసోడ్ కు సంబంధించి ఏదో ఒక లీక్ ఇవ్వడం…దాన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేయడం, పలు సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్ రకరకాలు కథనాలు రాసి… ఫైనల్ గా బిగ్ బాస్ షోకు కావాల్సినంత క్రేజ్ పెంచడం. అలాగే…ఈ ఫైనల్ కు సంబంధించి కూడా రాహుల్ విన్నర్ అంటూ ఓ లీక్ ఇచ్చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈసారి విన్నర్ టైటిల్ ఇంకా శ్రీముఖి చేతుల్లోనే ఉందని.. ఓ లీక్ వదిలేసి అలా గేమ్ ప్లే చేసారనే వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున ట్వీట్ చేయడం వెనుక కూడా ఇదే రహస్యం అంటున్నారు. ఫైనల్ ఎపిసోడ్ ఇంకా షూట్ చేయలేదని.. అది లైవ్ జరుగుతుందని చెబుతున్నారు నిర్వహకులు. కానీ..ఇప్పటికే ఫైనల్ కు సంబంధించిన రెండు ప్రోమోలు వచ్చేశాయి. ఇదో క్వశ్చన్ మార్క్. సరే అది లైవా ? రికార్డెడా ? అనేది పక్కన పెడితే…. మొత్తానికి ఈ ఫైనల్ విజేత ట్రోఫీ అందించడానికి బిగ్ బాస్ స్టేజ్ పైకి మెగా బాస్ చిరంజీవి వస్తున్నారన్నది మాత్రం నిజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *