Coimbatore : యువతిపై గ్యాంగ్‌ రేప్‌: ముగ్గురిపై ఎన్‌కౌంటర్‌

encounter

Coimbatore : తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులైన ముగ్గురిని 2025 నవంబర్04వ తేదీ మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అరెస్టు ఆపరేషన్ సమయంలో తప్పించుకోవడానికి ప్రయత్నించిన ముగ్గురి నిందుతుల కాళ్లపై కాల్పులు జరిపారుపోలీసులు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

సోమవారం ప్రత్యేక పోలీసు బృందాలు ఒక ఆలయం సమీపంలో తవాసి, కరుప్పసామి, కాళీశ్వరన్ అనే నిందితులు ఉన్నట్లుగా తెలుసుకుని చుట్టుముట్టారు. వారు కొడవళ్లతో పోలీసులపై  దాడి చేశారు. హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ఎడమ మణికట్టు, చేతికి గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రతిస్పందనగా పోలీసులు వారిపై తిరిగి కాల్పులు జరిపారు, దీంతో ముగ్గురు నిందితుల కాళ్లకు గాయాలు అయ్యాయి. తరువాత వారిని కోయంబత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.

యువతిపై గ్యాంగ్ రేప్ 

ఆదివారం రాత్రి కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం వెనుక ఉన్న బృందావన్ నగర్ సమీపంలో 20 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన దిగ్భ్రాంతికరమైన సంఘటన తర్వాత ఈ అరెస్టులు జరిగాయి.

బాధితురాలు తన ప్రియుడితో కలిసి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో పార్క్ చేసిన కారులో ఉండగా, ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించబడిన బైకుపై వచ్చి, కారు అద్దాలను పగలగొట్టి కారులో ఉన్న ఆమె  ప్రియుడిని ఆయుధాలతో దాడి చేశారు. అనంతరం ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో బాధితురాలిని వదిలిపెట్టి వెళ్లారు. గుర్తించిన స్థానికులు ఆమెను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తమిళనాడు అంతటా తీవ్ర సంచలనం సృష్టించింది, రాజకీయంగా కూడా  తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది .

తమిళనాడులో మహిళలపై జరుగుతున్న దారుణమైన నేరాల సంఖ్య తగ్గలేదనడానికి ఈ భయానక సంఘటన ఒక ఉదాహరణ అని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ అన్నారు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుండి, ఇలాంటి సంఘటనలు పెరిగాయయని, నిందితులు పోలీసులకు భయపడటం లేదని చూపిస్తున్నాయని బీజేపీ నేత అన్నామలై పేర్కొన్నారు.