Honeytrap: హనీట్రాప్కు యువకుడు బలి… హాట్ ఫోటోలు పెట్టి బెదిరించి!

honeytrap

Honeytrap:  హనీట్రాప్కు ఓ యువకుడు బలైపోయిన ఘటన కర్ణాటక లోని ఉడిపి జిల్లాలో జరిగింది. నిట్టే గ్రామానికి చెందిన అభిషేక్ అనే యువకుడు ఇటీవల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు . అయితే అతని మృతదేహం ఒక ప్రైవేట్ లాడ్జిలో దొరికింది. అతని మృతదేహంతో పాటుగా ఏడు పేజీల డెత్ నోట్ ఇప్పుడు అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. అతను ప్రేమించిన అమ్మాయి మొదట అతన్ని ప్రేమిస్తున్నట్లు నటించి, ఆపై ఆమెకు అశ్లీల ఫోటోలను పంపి బ్లాక్ మెయిల్ చేసింది.

రూ.4 లక్షలకు పైగా తీసుకొని

ఆమెతో పాటు ఆమె ముఠా అతని నుండి రూ.4 లక్షలకు పైగా తీసుకొని మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన అభిషేక్ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు డెత్ నోట్‌లో పేర్కొన్నాడు. తాను ప్రేమించిన అమ్మాయి నిరీక్ష అని, ఆమె ముఠా సభ్యులు మంగళూరుకు చెందిన రాకేష్, రాహుల్, తస్లిమ్ లు తన మరణానికి కారణమని అతను తన డెత్ నోట్ లో రాశాడు. అశ్లీల ఫోటోలను ఉపయోగించి తనతో పాటుగా చాలా మందిని ఇలాగే మోసం చేశారని కూడా అభిషేక్ తన నోట్ లో ఆరోపించాడు.

మరోవైపు, పోలీసు శాఖ ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. నిందితులను పిలిపించి విచారించారు పోలీసులు. దర్యాప్తులో వారి మొబైల్ రికార్డుల నుండి ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. డెత్ నోట్‌లో చేసిన ఆరోపణలకు మద్దతు ఇచ్చే ఆధారాలు ఏవీ దొరకలేదు. అభిషేక్ లవ్ ఫెయిల్ కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హనీ ట్రాప్ వంటి తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు తీవ్ర మలుపు తిరిగింది.