student: బాత్రూమ్ లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు!

student

student: బెంగళూరులో ఓ సీనియర్‌పై జూనియర్ స్టూడెంట్ దారుణానికి పాల్పడ్డాడు. కాలేజీ క్యాంపస్‌ పురుషుల టాయిలెట్‌లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఏడో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థిని కాగా, నిందితుడు జీవన్ గౌడ (21) అదే కాలేజీలో ఐదో సెమిస్టర్ విద్యార్థి చదువుతున్నాడు.

అయితే 2025 అక్టోబరు 10న లంచ్ బ్రేక్ సమయంలో మాట్లాడాలని పదేపదే ఫోన్ చేసి జీవన్ గౌడ బాధితురాలిని ఏడో అంతస్తులోని ఆర్కిటెక్చర్ బ్లాక్ వద్దకు పిలిపించాడు. అక్కడ ఆమె రాగానే బలవంతంగా ఆమెను ముద్దుపెట్టుకోవడానికి ట్రై చేశాడు. దీంతో ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించగా, ఆరో అంతస్తు వరకు వెంబడించి, ఆమెను బలవంతంగా పురుషుల వాష్‌రూమ్‌లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

మధ్యాహ్నం 1.30 నుండి 1.50 గంటల మధ్య ఆమెపై అత్యాచారం జరిగింది. ఈ దారుణం జరిగిన తర్వాత, నిందితుడు.. బాధితురాలికి ఫోన్ చేసి, “నీకు గర్భనిరోధక మాత్ర (Pill) కావాలా?” అని అడిగాడు. బాధితురాలు వెంటనే ఫోన్ కట్ చేసింది. ఈ విషయంపై మొదట భయంతో బాధితురాలు ఎవరికి చెప్పలేదు.

చివరకు స్నేహితులు, తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పి వారి సహకారంతో అక్టోబరు 15న హనుమంతనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు జీవన్ గౌడను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. విద్యాబుద్ధులు నేర్పే కళాశాల ప్రాంగణంలోనే ఈ ఘటన జరగడంకలకలం రేపింది.