Bengaluru : ముగ్గురు మొగుళ్ల ముద్దుల పెళ్లాం..అందంతో వల వేసి.. లక్షలతో జంప్!

Bengaluru

Bengaluru :  బెంగళూరుకు చెందిన ఒక కిలాడీ లేడీ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అందంతో వల వేయడం(Bengaluru ), పెళ్లి పేరుతో బురిడీ కొట్టించడం ఆమె నైజం. ఒకరిని కాదు.. ఇద్దరిని కాదు.. ఏకంగా ముగ్గురిని పెళ్లాడి, లక్షల రూపాయలు వసూలు చేసిన ఈమె అసలు రంగును ఆమె భర్తలే బయటపెట్టడం విశేషం. దొడ్డబళ్లాపురానికి చెందిన సుధారాణి అనే మహిళ చేసిన ఈ పెళ్లిళ్ల మోసం ఇప్పుడు వైరల్ గా మారింది.

దొడ్డబళ్లాపురానికి చెందిన వీరేగౌడతో సుధారాణికి మొదటి పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కొన్నాళ్ల తర్వాత తన భర్తను వింత కారణంతో వేధించడం మొదలుపెట్టింది. నీకు కారు, బుల్లెట్ నడపడం రాదు అంటూ హేళన చేస్తూ, భర్తను పిల్లలను వదిలేసి వెళ్ళిపోయింది.

మొదటి భర్తను వదిలేశాక, అనంతమూర్తి అనే డెలివరీ బాయ్‌కు వల వేసింది. నా భర్త చనిపోయాడు, నేను ఒంటరిదాన్ని అంటూ నమ్మించి దేవాలయంలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అసలు ఆట మొదలుపెట్టింది. మా నాన్నకు ఆపరేషన్ చేయించాలి, అది ఇది అంటూ రకరకాల కారణాలు చెప్పి అతని దగ్గర నుంచి ఏకంగా 20 లక్షల రూపాయలు వసూలు చేసి పరారైంది.

రెండో భర్తను నట్టేట ముంచిన ఈ కిలాడీ లేడీ.. ఇప్పుడు కనకపురకు చెందిన మరో వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుందని ఆరోపణలు వస్తున్నాయి. కేవలం డబ్బు ఉన్నవారినే టార్గెట్ చేస్తూ, ప్రేమ పేరుతో మోసం చేస్తోందని ఆమె మొదటి ఇద్దరు భర్తలు పోలీసులను ఆశ్రయించారు. నాకు ఆమె వద్దు.. నా డబ్బు నాకు ఇప్పించండి అంటూ రెండో భర్త అనంతమూర్తి పోలీసుల వేడుకుంటున్నాడు.

డబ్బు కోసం మనుషుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ మాయలేడి వ్యవహారం ఇప్పుడు బెంగళూరులో సంచలనం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ పెళ్లిళ్ల వెనుక ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో తేలాల్సి ఉంది.