Best Credit Cards in India 2026 : ఈ రోజుల్లో జేబులో రూపాయి లేకపోయినా పర్వాలేదు చేతిలో ఒక క్రెడిట్ కార్డ్ ఉంటే చాలు, ఏ పనైనా చిటికెలో అయిపోతుంది. కేవలం షాపింగ్‌లకే కాదు, హాస్పిటల్ ఎమర్జెన్సీ వచ్చినా లేదా అనుకోకుండా ఏదైనా కొనాల్సి వచ్చినా క్రెడిట్ కార్డ్ (Best Credit Cards in India 2026 )ఒక వరంలా మారుతుంది. అయితే మార్కెట్‌లో రకరకాల కార్డులు(Apply for Credit Card) ఉన్నాయి కదా అని ఏది పడితే అది తీసుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువ. మరి 2026లో మీ ఖర్చులకు సెట్ అయ్యేలా, మీకు ఎక్కువ క్యాష్‌బ్యాక్ ఇచ్చే బెస్ట్ క్రెడిట్ కార్డ్‌ను ఎలా ఎంచుకోవాలో చూద్దాం.
1. లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ (No Annual Fee): చాలా మంది Annual Fee చెల్లించడానికి ఇష్టపడరు. అటువంటి వారి కోసం Amazon Pay ICICI Credit Card లేదా IDFC First Bank కార్డ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. వీటికి ఎటువంటి చార్జీలు ఉండవు సరే కదా, అమెజాన్ షాపింగ్‌పై మంచి రివార్డ్స్ కూడా లభిస్తాయి.
2. షాపింగ్, క్యాష్‌బ్యాక్ కోసం: మీరు ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారైతే Flipkart Axis Bank Credit Card లేదా SBI CashBack Card ని ఎంచుకోండి. ఇవి నేరుగా మీ బిల్లులో 5% వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తాయి. దీనివల్ల నెలవారీ ఖర్చులపై భారీగా ఆదా చేసుకోవచ్చు.
3. ట్రావెల్, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్: మీరు తరచుగా ప్రయాణాలు చేస్తుంటే HDFC Regalia లేదా SBI Elite కార్డ్స్ బెస్ట్. ఇవి ఉచితంగా ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌తో పాటు, విమాన టిక్కెట్ల బుకింగ్‌పై భారీ రివార్డ్ పాయింట్లను అందిస్తాయి.
క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు ఇవి గమనించండి:
సకాలంలో బిల్లు చెల్లించకపోతే వడ్డీ రేట్లు 40% వరకు ఉండవచ్చు. మంచి క్రెడిట్ కార్డ్ రావాలంటే మీ సిబిల్ స్కోర్(Check CIBIL Score) 750 కంటే ఎక్కువగా ఉండాలి. జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజుల గురించి ముందే తెలుసుకోండి. సరైన క్రెడిట్ కార్డును ఎంచుకోవడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవచ్చు. అదే సమయంలో ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీ ఖర్చుల శైలిని బట్టి పైన పేర్కొన్న వాటిలో ఒకదాన్ని ఎంచుకోండి.
