BIG BREAKING : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తీవ్ర విషాదం నెలకొంది. కొద్దిసేపటి క్రితమే తర్లాయ్ కలాన్ ప్రాంతంలో ఉన్న ఖదీజా తుల కుబ్రా మసీదులో భారీ బాంబు పేలుడు సంభవించింది. శుక్రవారం కావడంతో మసీదులో భక్తులు ప్రార్థనల్లో మునిగి ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
A suicide blast has been reported at an Imambargah in Tarlai, Islamabad. Police and rescue teams are on their way to the scene. An emergency has been declared across Islamabad on the orders of the Inspector General. #Islamabad pic.twitter.com/3EGPDK9pMR
— Talha Khan (@TalhaKhanTRT) February 6, 2026
ఈ పేలుడు ధాటికి మసీదు ప్రాంగణం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ప్రార్థనల కోసం వచ్చిన వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలం అంతా రక్తసిక్తంగా మారిపోయింది. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టాయి. గాయపడిన వారిని హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
ప్రస్తుతానికి 50మందికి పైగా చనిపోయారని సమాచారం. మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని భయపడుతున్నారు. ఇస్లామాబాద్ లాంటి హై-సెక్యూరిటీ జోన్లో ఇలాంటి దాడి జరగడం కలకలం రేపుతోంది. గత ఏడాది నవంబర్‌లో కూడా కోర్టు దగ్గర ఇలాంటి ఆత్మాహుతి దాడే జరిగింది, అప్పట్లో 12 మంది చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ మసీదును టార్గెట్ చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.
